:: Welcome to NRI - Article ::

అమెరికాలో ‘2 కంట్రీస్‌’

సునీల్‌ కథానాయకుడిగా ఎన.శంకర్‌ స్వీయనిర్మాణంలో ఓ సినిమా రూపొందుతుంది. మలయాళ ‘2 కంట్రీస్‌’ చిత్రానికి రీమేక్‌ ఇది. ఎన.శంకర్‌ మాట్లాడుతూ ‘‘2 కంట్రీస్‌’ మలయాళంలో రూ.55 కోట్లు వసూలు చేసింది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి రొమాంటిక్‌ కామెడీ డ్రామాగా తెరకెక్కిస్తున్నాం. ఈ నెల 15 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది. మాగ్జిమమ్‌ షూట్‌ అమెరికాలోనే ప్లాన చేస్తున్నాం’’ అని అన్నారు. నరేశ, షాయాజి షిండే, పోసాని, పృథ్వీ, శ్రీనివాసరెడ్డి, ఝాన్సీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సి.రాంప్రసాద్‌, సంగీతం: గోపీసుందర్‌, సంభాషణలు: శ్రీధర్‌ సీపాన.