Top-10-movies-in-Overseas

టాప్-10లో రెండు పవన్, ఎన్టీఆర్‌ సినిమాలు

 

త్రివిక్రమ్- పవన్ కాంబినేషన్‌లో వచ్చిన అజ్ఞాతవాసి.. రికార్డు స్థాయి కలెక్షన్లను కొల్లగొడుతోంది. నెగిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్ల జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లో కూడా భారీ స్థాయిలో ఈ సినిమా విడుదలయింది. ప్రీమియర్ షోల ద్వారానే అమెరికాలో 1.5 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసిన ఈ సినిమా.. ఏడురోజుల్లోనే టాప్-10 సినిమాల జాబితాలోకి వచ్చింది. ఓవర్సీస్‌లో హయ్యస్ట్ కలెక్షన్లను సాధించిన సినిమాలో ఒకటిగా అజ్ఞాతవాసి కూడా నిలిచింది. కాగా అత్తారింటికి దారేది సినిమా కూడా టాప్-10 సినిమాల జాబితాలో ఉంది. ఈ సినిమా కూడా పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లోదే కావడం గమనార్హం.. బాహుబలి పార్ట్-1, పార్ట్-2 సినిమాలను ఒకటిగా లెక్కిస్తే.. టాప్-10 సినిమాల్లో కేవలం పవన్, ఎన్టీఆర్‌కు మాత్రమే రెండేసి సినమాలు ఉన్నాయి.  

ఓవర్సీస్‌లో టాప్-10 సినిమాలు
1. బాహుబలి-2 ====== 20.77 మిలియన్ డాలర్లు
2. బాహుబలి-1 ====== 7.51 మిలియన్ డాలర్లు
3. శ్రీమంతుడు ====== 2.89 మిలియన్ డాలర్లు
4. అ..ఆ.. ====== 2.45 మిలియన్ డాలర్లు
5. ఖైదీ నెం.150 ====== 2.45 మిలియన్ డాలర్లు
6. ఫిదా ====== 2.07 మిలియన్ డాలర్లు
7. నాన్నకు ప్రేమతో ====== 2.02 మిలియన్ డాలర్లు
8. అజ్ఞాతవాసి  ====== 2 మిలియన్ డాలర్లు (రన్నింగ్)
9. అత్తారింటికి దారేది  ====== 1.90 మిలియన్ డాలర్లు
10. జనతాగ్యారేజ్   ====== 1.80 మిలియన్ డాలర్లు