:: Welcome to NRI - Article ::

టాప్-10 లెక్కల్ని మార్చేసిన ఫిదా..

కుటుంబ కథా చిత్రాలకు కలెక్షన్లు ఏ రేంజ్‌లో వస్తాయనేది మరోసారి తేల్చిచెప్పింది ‘ఫిదా’ సినిమా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాణ సారధ్యంలో వరుణ్ తేజ్, సాయిపల్లవి కలయికలో వచ్చిన ఈ సినిమాకు కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌‌లో కూడా ఓ రేంజ్‌లో రికార్డులు సృష్టిస్తోంది ఈ సినిమా. పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది ఓవర్సీస్ కలెక్షన్లను కూడా దాటేసి నయా రికార్డులు సృష్టిస్తోంది. మూడో వీకెండ్‌ వచ్చేసరికి 1.97 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసిన ఫిదా.. లాంగ్‌రన్‌లో కనీసం 2.3 మిలియన్ డాలర్లను దాటగలదని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ధాటికి ఓవర్సీస్‌లో టాప్-10 లిస్ట్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే ఏడో స్థానానికి చేరకున్న ఫిదా.. ఎట్టకేలకు టాప్-6 ప్లేస్‌లోకి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఓవర్సీస్‌లో టాప్-10 లెక్కలను ఫిదా మార్చేసింది. ఆ టాప్-10 సినిమాలేవో ఓ లుక్కేయండి. 
 
1. బాహుబలి- 2----------- 20.47 మిలియన్ డాలర్లు
2. బాహుబలి-1-----------7.51 మిలియన్ డాలర్లు
3. శ్రీమంతుడు----------- 2.89 మిలియన్ డాలర్లు
4. అ..ఆ..-----------2.45 మిలియన్ డాలర్లు
5. ఖైదీ నెం.150-----------2.45 మిలియన్ డాలర్లు
6. నాన్నకు ప్రేమతో..-----------2.02 మిలియన్ డాలర్లు
7. ఫిదా----------- 1.97 మిలియన్ డాలర్లు
8. అత్తారింటికి దారేది-----------1.90 మిలియన్ డాలర్లు
9. జనతాగ్యారేజ్----------- 1.80 మిలియన్ డాలర్లు
10. గౌతమిపుత్ర శాతకర్ణి----------- 1.66 మిలియన్ డాలర్లు

Loading...