Toliprema-Overseas-audience-response

తొలిప్రేమ.. ఓవర్సీస్ రెస్పాన్స్

మెగా హీరో వరుణ్‌తేజ్, రాశీఖన్నా జంటగా బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాతగా, వెంకీ అట్లూరీ దర్శకత్వంలో వచ్చిన తొలిప్రేమ సినిమాకు ఎన్నారై సినీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 10న విడుదల కానున్నఈ సినిమా.. అమెరికాలో ఓ రోజు ముందుగానే విడుదలయింది.  సినిమాపై ఉన్న నమ్మకంతో ఓ రోజు ముందుగానే అమెరికాలో ‘తొలిప్రేమ’ను చిత్రబృందం విడుదల చేసింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఈ సినిమా ఆకట్టుకుంటుందని ప్రవాసులు చెబుతున్నారు. అమెరికాలో ఈ సినిమాకు ప్రీమియర్ల ద్వారానే 1.50 లక్షల డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. 

ఆదిత్య(వరుణ్‌తేజ్), వర్ష(రాశీఖన్నా) ఓ రైలు ప్రయాణంలో కలుసుకుంటారు. మొదటిచూపులోనే ఆమెతో ఆదిత్య ప్రేమలో పడిపోతాడు. అనుకోకుండా వీళ్లిద్దరూ బీటెక్ చేయడానికి ఒకే కాలేజీలో చేరతారు. మొత్తానికి ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే అనుకోని కారణాల వల్ల ఆదిత్య, వర్షకు బ్రేకప్ అవుతుంది. మళ్లీ ఆరేళ్ల తర్వాత లండన్‌లో వీళ్లిద్దరూ కలుసుకోవాల్సి వస్తుంది. ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వీళ్లిద్దరి మధ్య ప్రేమ మళ్లీ చిగురించిందా..? అసలు వీళ్లిద్దరికీ ఎందుకు బ్రేకప్ అయింది..? వర్షపై ఆదిత్య ఎందుకు అసహ్యం పెంచుకుంటాడు..? అనే అంశాలతో సినిమా సాగుతుంది. లవ్- బ్రేకప్- లవ్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అయే అవకాశం ఉంది. 
 
మొదటి సినిమా అయినా దర్శకుడు వెంకీ అట్లూరి.. మెచ్యూర్డ్ కథతో అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో సినిమాను తీర్చిదిద్దారని ఎన్నారైలు అంటున్నారు. సినిమాలో వరుణ్ తేజ్ నటన హైలెట్‌గా నిలుస్తుందనీ, ప్రియదర్శి పులికొండ, హైపర్ ఆది కామెడీ అలరిస్తుందంటున్నారు. తొలిప్రేమ టైటిల్‌కు న్యాయం చేసేదిగా ఈ సినిమా ఉందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ తరం యువతకు తగ్గట్టుగా మెచ్యూర్డ్ లవ్‌స్టోరీతో హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్, సెంటిమెంట్ సీన్స్‌తో ప్రేక్షకుల గుండెను హత్తుకుంటుందంటున్నారు.