titanic-sequel-will-coming-soon-

‘టైటానిక్ 2’ రాబోతోంది...

‘టైటానిక్’ అవడానికి హాలీవుడ్ చిత్రమైన అన్ని చిత్రసీమలకు సుపరిచితమైన సినిమా. క్లాస్, మాస్ తేడా లేకుండా ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ అభిమానించారు. జేమ్స్‌ క్యామెరూన్‌ దర్శకత్వంలో లియోనార్డో డికాప్రియో, కేట్‌ విన్స్‌లెట్‌ జంటగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 11 ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది. ఇంతగొప్ప సినిమాకు త్వరలో సీక్వెల్ రానుంది.

 
‘టైటానిక్’ వచ్చిన వెంటనే సీక్వెల్‌ని తీయాలనుకున్నారట. కానీ అప్పుడు కుదరలేదు. అది ఇప్పుడు కార్యరూపం దాల్చుతోంది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయనాయకుడైన క్లైవ్‌ పామర్‌ ఈ సినిమా సీక్వెల్‌ తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా క్లైవ్ మాట్లాడుతూ.. ‘టైటానిక్‌లో ప్రయాణించాలని లక్షలాది మంది కలలు కన్నారు. ‘టైటానిక్ 2’తో వారి ఆశలు నెరవేరబోతున్నాయి’ అని తెలిపారు.