:: Welcome to NRI - Article ::

జై లవకుశ, స్పైడర్, మహానుభావుడు.. ఆదివారం కలెక్షన్ రిపోర్ట్..

దసరా పర్వదినం సందర్భంగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన జై లవకుశ, స్పైడర్, మహానుభావుడు సినిమాలు మంచి టాక్‌ను తెచ్చుకున్నాయి. మాస్ అండ్ ఫ్యామిలీ మూవీగా జై లవకుశ, యాక్షన్ థ్రిల్లర్‌గా స్పైడర్, క్లాస్ అండ్ ఫ్యామిలీ మూవీగా మహానుభావుడు సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. వీటిలో జై లవకుశ సినిమా సెప్టెంబర్ 21న విడుదల కాగా.. స్పైడర్ సినిమా సెప్టెంబర్ 27న, మహానుభావుడు సినిమా సెప్టెంబర్ 29న విడుదలయ్యాయి. జై లవకుశ, స్పైడర్ సినిమాలు ఇప్పటికే 100 కోట్ల రూపాయల కలెక్షన్లు దాటేసి కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.. ఓవర్సీస్‌లో కూడా విడుదలయిన ఈ మూడు సినిమాల కలెక్షన్ల వివరాలను సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. 

 
జై లవకుశ సినిమా ఆదివారం 17 వేల 903 డాలర్ల కలెక్షన్లతో మొత్తం 15లక్షల 26వేల 700 డాలర్లను(10కోట్ల రూపాయలు) కలెక్ట్ చేసినట్లు ఆయన ట్వీట్ చేశారు. అదే విధంగా స్పైడర్ సినిమా ఆదివారం 57వేల 434 డాలర్లను కలెక్ట్ చేసి 14 లక్షల 58వేల 411 డాలర్లను (9.55కోట్ల రూపాయలు) కొల్లగొట్టింది. ఈ రెండు సినిమాల కంటే ఆదివారం మహానుభావుడుకు కాస్త ఎక్కువే కలెక్షన్లు వచ్చాయని తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ఆదివారం 97వేల 429 డాలర్ల కలెక్షన్లను కొల్లగొట్టి మహానుభావుడు 5 లక్షల 13వేల 616 డాలర్లను(3కోట్ల 36 లక్షల రూపాయలు) కలెక్ట్ చేసిందట. అయితే ఈ మూడు సినిమాల్లో స్పైడర్‌కు ఎక్కువ థియేటర్లు ఉండగా.. ఆ తర్వాత మహానుభావుడు, ఆ తర్వాత జై లవకుశ సినిమాకు స్క్రీన్లు ఎక్కువ ఉన్నాయి.