Taran-Adarsh-coments-on-Mahesh-over-Khans

‘మహేశ్‌‌కు ఓవర్సీస్‌లో ఖాన్స్‌కు మించిన క్రేజ్’

సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవర్సీస్‌లో సినిమా హీరోల క్రేజ్‌ను పోల్చుతూ మహేశ్‌ను ఆకాశానికెత్తేశారు. ‘బాలీవుడ్‌లో చాలామంది పెద్ద పెద్ద నటులు ఉన్నారు. వాళ్ల సినిమాలు ఓవర్సీస్‌లో లాంగ్‌రన్‌లో కూడా ఒక మిలియన్ డాలర్ మార్కును చేరుకోలేకపోతున్నాయి. ఓవర్సీస్‌లో షారూ‌ఖ్ కాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ సినిమాలకు భారీ క్రేజ్ ఉంది. వారి సినిమాలకు కూడా భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. కానీ ‘స్పైడర్’ సినిమా కలెక్షన్లతో పోల్చితే ఖాన్స్ త్రయం కంటే టాలీవుడ్ హీరో మహేశ్‌ చాలా ముందు ఉన్నాడు. ఓవర్సీస్‌లో మహేశ్‌కు వాళ్లకంటే ఎక్కువే మార్కెట్ ఉంది. బాలీవుడ్ హీరోలకు అందనంత ఎత్తులో ఓవర్సీస్ మార్కెట్‌ను మహేశ్ సొంతం చేసుకున్నాడు’.. అని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఓ ఇంటర్వ్యూలో తేల్చిచెప్పారు. మురుగదాస్, మహేశ్ కలయికలో భారీ అంచనాల నడుమ వచ్చిన ‘స్పైడర్’.. 2017లోనే రెండో అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచిందనీ, అయినా దానికి వచ్చిన కలెక్షన్లు చూస్తే ఆశ్చర్యం వేస్తుందన్నారు.