talk-about-peta-movie-in-america-

ఆ రెండు చిత్రాల కంటే వెనుకబడిన రజినీ ‘పేట’

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం ‘పేట’. ఈ చిత్రం తమిళనాడు, తెలుగురాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ విడుదలయి మంచి టాక్ తెచ్చుకుంది. అమెరికాలోని 220 లొకేషన్లలో రిలీజైన ‘పేట’ భారీ ఓపెనింగ్స్ రాబట్టినట్లు సినీ విశ్లేషకులు వెల్లడించారు. ప్రీమియర్ షోల ద్వారా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం 5,45,000 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.3.84 కోట్లు వసూలు చేసిందని తెలిపారు. అయితే గతంలో విడుదలైన రజినీ సినిమాలు 2.ఓ, కబాలి చిత్రాలే భారీ ఓపినింగ్స్ సాధించినట్లు చెప్పారు. వాటి పోల్చితే ఈ పేట వెనకబడిందని, అయితే పూర్తి కలెక్షన్ల వివరాలు తెలియాల్సి ఉందని విశ్లేషకులు తెలిపారు.

 
కాగా ఈ ‘పేట’లో రజినీ సరసన సిమ్రాన్, త్రిష నటించారు. వీరితో పాటు విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి అనురుధ్ సంగీతం అందించారు. సన్‌పిక్చర్స్ బ్యానర్‌లో కళా నిధిమారన్ నిర్మించగా దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని వల్లభనేని అశోక్ తెలుగులో విడుదల చేశారు.