:: Welcome to NRI - Article ::

స్పైడర్.. కలెక్షన్లెంతో తేల్చిచెప్పిన చిత్ర బృందం

మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా నటించిన స్పైడర్‌కు రెండో వీకెండ్‌లోనూ రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. రకుల్‌ప్రీత్‌ సింగ్ హీరోయిన్‌గా, ఎస్‌జే సూర్య, ప్రేమిస్తే భరత్, విలన్లుగా నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న విడుదలయింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా.. ఓవర్సీస్‌లోనూ కలెక్షన్లను కొల్లగొడుతోంది. బాహుబలి తర్వాత ఓవర్సీస్‌లో అత్యధిక స్క్రీన్లలో విడుదలయిన ఈ సినిమా.. ప్రీమియర్ల ద్వారానే ఒక మిలియన్ డాలర్ మార్కును దాటేసింది. గురువారం వరకు ఓవర్సీస్‌లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల వివరాలను సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. గురువారం వరకు మొత్తం 15 లక్షల 4వేల 290 డాలర్లను (9 కోట్ల 86 లక్షల రూపాయలు) కలెక్ట్ చేసింది. 
 
కాగా సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయిన ఈ సినిమా.. శనివారం వరకు .. అంటే మొత్తం 11 రోజుల్లో 150 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినట్లు అఫిషియల్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. వీకెండ్ అయిన ఆదివారం కూడా  కలెక్షన్లు బాగానే ఉంటాయని సినీ పండితులు అంచనావేస్తున్నారు. ఓవర్సీస్‌లో ఈ సినిమా మార్కెట్ మొత్తంగా 1.6 మిలియన్ డాలర్ల వద్దకు చేరుకుంటుందని చెబుతున్నారు.