Special-Record-For-NTR-

ఎన్టీయార్ అరుదైన రికార్డు!

యంగ్ టైగ‌ర్ ఎన్టీయార్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన `అర‌వింద స‌మేత‌` పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల‌తోపాటు ఓవ‌ర్సీస్‌లోనూ ఈ సినిమా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. విడుద‌లైన తొలి రోజే ఓవ‌ర్సీస్‌లో మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లోకి చేరిపోయింది.

ప్ర‌స్తుతం 1.5 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు సాధించి రెండు మిలియ‌న్‌ల వైపు అడుగులేస్తోంది. ఈ వ‌సూళ్ల‌తో ఎన్టీయార్ ఓవ‌ర్సీస్‌లో అరుదైన రికార్డు సాధించాడు. దక్షిణాదికి చెందిన ఏ హీరోకూ లేని రికార్డును అందుకున్నాడు. ఎన్టీయార్ గ‌త చిత్రాలైన `నాన్న‌కు ప్రేమ‌తో`, `జ‌నతా గ్యారేజ్‌`, `జైల‌వ‌కుశ‌` సినిమాలు కూడా ఓవ‌ర్సీస్‌లో 1.5 మిలియ‌న్ డాల‌ర్ల క‌లెక్ష‌న్ల‌ను అందుకున్న సినిమాలుగా నిలిచాయి. తాజాగా `అర‌వింద స‌మేత‌` కూడా ఆ ఫీట్‌ను రిపీట్ చేసింది. దీంతో వ‌రుస‌గా నాలుగు సార్లు ఓవ‌ర్సీస్‌లో 1.5 మిలియ‌న్ డాల‌ర్ల క‌లెక్ష‌న్లు సాధించిన హీరోగా ఎన్టీయార్ నిలిచాడు. ద‌క్షిణాదిలోనే ఈ రికార్డు ఏ హీరోకూ లేదు.