:: Welcome to NRI - Article ::

‘శాతకర్ణి’ విజయం కోరుతూ అమెరికాలో ప్రత్యేక పూజలు

నందమూరి బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి విజయం సాధించాలని కోరుతూ అమెరికాలోని అయన అభిమానులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. భారతదేశంలో కంటే కొన్ని గంటలు ముందుగా అంటే బుధవారమే ఈ సినిమా అమెరికాలో విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా విజయం సాధించాలని కోరుతూ... అమెరికాలోని బే ప్రాంతంలోని సిద్ధి వినాయక దేవాలయంలో కుంకుమపూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని సెర్రా థియేటర్ వరకు 100 కార్లతో ర్యాలీ చేయనున్నారు. అక్కడ జరిగేకార్యక్రమంలో రాజు గౌతమీపుత్ర శాతకర్ణి గొప్పతనాన్ని, బాలయ్య నట రాజసాన్ని వివరించే ఒక ఆడియో వీడియో విజువల్‌ని కూడా ప్రదర్శించనున్నారు. బాలకృష్ట 100వ సినిమా విడుదలకు గుర్తుగా 100  కేజీల  కేక్‌ని కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకోనున్నామని  అమెరికాలోని బాలయ్య అభిమానులు బొబ్బా శ్రీ రామ్ ,కొల్లి నాని తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా శాతకర్ణి పతాకాలను ప్రదర్శించారు.  

 

Loading...