:: Welcome to NRI - Article ::

దుబాయిపై డాక్యుమెంటరీ.. అయిదేళ్లు పట్టిందట..!

యూఏఈ: దుబాయి నగరం. ఎన్నో లక్షల మందికి నివాసం. మరెన్నో లక్షల మంది విదేశీయుల ఉపాధికి స్థావరం. ఎన్నో విశిష్టతలు ఉన్న దుబాయి మహానగరం గురించి ఓ స్పెషల్ డాక్యుమెంటరీ తీయాలని ఎవరికి అనిపించదు. ఒమర్ అల్సల్‌మన్ అనే వ్యక్తికి కూడా అదే ఆలోచన వచ్చింది. ‘AWAKEN’ పేరుతో దుబాయిపై ప్రత్యేక డాక్యుమెంటరీని తీసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఎన్నో విశిష్టతలు ఉన్న దుబాయి గురించి డాక్యుమెంటరీ తీయాలంటే తక్కువ సమయం చాలదని వారికి తొందర్లేనే అర్థమయింది. మొత్తానికి ఎలాగోలా అయిదేళ్లు సమయం తీసుకుని ఈ డాక్యుమెంటరీని పూర్తి చేశారు ఒమర్. దీనికి సంబంధించిన ఓ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ రేంజ్ ఎలా ఉందటే.. మంగళవారం స్వయంగా దుబాయి యువరాజు షేక్ హమ్‌దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ షేర్ చేశారు కూడా. దీన్ని 2018 ప్రారంభంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు కూడా.  ఆ ట్రైలర్‌ను వీక్షించి దుబాయి అందాలను చూసేయండి. 

Loading...