:: Welcome to NRI - Article ::

బాక్సాఫీస్‌ని కుదిపేస్తున్న సింగం 3

యముడు, యముడు 2 (సింగం) సినిమాలతో బాక్సాఫీస్ దుమ్ము దులిపేసిన సూర్య మరోసారి సింగం3 (యముడు 3)తో అదే జోరుని చూపిస్తున్నాడు. యముడు సిరీస్‌లో వచ్చిన 3వ సినిమా కావడతో  సింగం3 ( యముడు 3)పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్టే సినిమా కూడా ఉండటంతో తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులు ఈ సినిమాను హిట్‌ సినిమాగా మలిచారు. ముఖ్యంగా చెప్పాలంటే ఓవర్సీస్‌లో ఈ సినిమాకి మంచి కలెక్షన్లే వస్తున్నాయని చెప్పవచ్చు.

ఎందుకంటే గురువారం సింగం3 (తెలుగు, తమిళం) రెండు భాషలకు గాను 36 వేల 914 డాలర్ల కలెక్షన్లు సాధించిందట. అదే విధంగా శుక్రవారం ఓవర్సీస్‌లో 65 వేల 295 డాలర్ల కలెక్షన్లు వచ్చినట్టు టాక్. గురువారం కంటే ఎక్కువగా శుక్రవారం ఓవర్సీస్‌లో ఎక్కువ కలెక్షన్లు రావడం చూస్తే ముందు రోజుల్లో ఈ సినిమా ఎంతమేరకు కలెక్షన్లు సాధిస్తుందో అంచనా వేసుకోవచ్చు. తక్కువ కాలంలోనే ఇన్ని కలెక్షన్లు సాధిచండం వల్ల సూర్య తొందరలోనే ఓవర్సీస్‌లో 1 మిలియన్ డాలర్లు రికార్డుని అందుకుంటాడనే విషయం తెలుస్తుంది.