shilaja-reddy-alludu--movie-highest-collections-

‘శైలజా రెడ్డి అల్లుడు’ హవా.. చైతూ కెరీర్ లోనే..

వినాయక చవితి కానుకగా ఈ గురువారం థియేటర్లలో అడుగుపెట్టిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ మంచి జోరు మీదున్నాడు. తొలిరోజే సక్సెస్ టాక్ తెచ్చుకొని భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతూ హవా కొనసాగిస్తున్నాడు. అటు ఓవర్సిస్‌లోనూ, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి తొలిరోజే 12 కోట్ల వసూళ్లు రాబట్టి నాగచైతన్య కెరీర్ లోనే తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది ‘శైలజా రెడ్డి అల్లుడు’. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా పోస్టర్ బయటకు వదిలింది చిత్రయూనిట్.

 
సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో చైతూ అత్తగా రమ్యకృష్ణ నటించగా.. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించింది. సీనియ‌ర్ న‌రేశ్‌, వెన్నెల కిశోర్‌, ర‌ఘుబాబు, ముర‌ళీశర్మ‌, పృథ్వీ, శ‌ర‌ణ్య ప్రదీప్ త‌దిత‌రులు ముఖ్యపాత్రలు పోషించారు. గోపీచంద్ సంగీతం అందించారు. ప్రస్తుతం సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే లాంగ్ రన్‌లో ‘అల్లుడు’ భారీ వసూళ్లు రాబట్టడం ఖాయం అని తెలుస్తోంది.