scotland-mahila-manula-sandadi-at-mahanati-theatre

‘మహానటి’ని వీక్షించిన ‘స్కాట్‌లాండ్ తెలుగు మహిళా శిరోమణులు’

వెండితెరపై ఓ వెలుగు వెలిగిన అలనాటి నటి సావిత్ర జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమా జోరు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. ప్రేక్షకులను థియేటర్ల వద్దకు క్యూ కట్టిస్తున్న ఈ సినిమా రికార్డ్ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తోంది. ఈ సినిమాకు అశ్విన్ నాగ్ దర్శకత్వం వహించగా సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరితోపాటు సినిమాలో నటించిన వారందరికీ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరి ప్రశంసలు అందుతున్నాయి. 

అయితే వివిధ దేశాలలో నివసిస్తున్న తెలుగువారు ‘మహానటి’ సినిమాకు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. స్కాట్‌లాండ్‌లో మే 13 ఆదివారం ఉదయం ప్రత్యేక షోను ప్రదర్శించారు. ఈ షోకు ‘స్కాట్‌లాండ్ తెలుగు మహిళా శిరోమణులు’ హాజరయ్యారు. పాతకాలం నాటి దుస్తులు ధరించి ఆకట్టుకున్నారు. థియేటర్ వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్కాట్‌లాండ్ డిస్ట్రిబ్యూటర్ ఉదయ్ కుమార్ కుచడి, యూకే డిస్ట్రిబ్యూటర్ శామ్ సజ్జాకు మహిళా బృందం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసింది.