record-breaking-collections-

రికార్డులు బద్దలు.. ‘2.ఓ’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే..

శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, అమీ జాక్సన్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘2.ఓ’. ఈ చిత్రం నేడు(గురువారం) ప్రపంచవ్యాప్తంగా పదివేల స్క్రీన్లలో రిలీజ్ అయింది. ఊహించినట్టుగానే ఈ చిత్రం గురించి మంచి సక్సెస్ టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ‘2.ఓ’ విజువల్ వండర్ అని చూసిన వారి నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. అయితే ఈ సినిమా కోలీవుడ్‌లోనే కనీవినీ ఎరుగని రికార్డు కలెక్షన్లు సాధించిందని ప్రముఖ సినీ విమర్శకుడు, యూకే సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సంధు ట్వీట్ చేశారు.

‘‘ఇది రజనీకాంత్, అక్షయ్ కుమార్ ఫ్యాన్స్‌కి సెలబ్రేషన్ టైమ్. 2.ఓ కోలీవుడ్‌లోని అన్ని కలెక్షన్ల రికార్డులను బద్దలుకొట్టింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున ఏకంగా రూ.110 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది’’ అని ఉమైర్ ట్వీట్ చేశారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడు టాలీవుడ్ చిత్రాలు 1. ‘2.ఓ’ = రూ.110+ కోట్లు (రికార్డ్), 2. కబాలీ = రూ.80 కోట్లు, 3.సర్కార్ = రూ.70 కోట్లు’’ అని మరో ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు.