Rangasthalam-in-overseas

ఓవర్సీస్‌లోనూ రంగస్థలం..

రామ్‌‌చరణ్- సమంత కాంబినేషన్‌లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘రంగస్థలం’ సినిమాను మార్చి నెలలో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. సుకుమార్ సినిమాలకు ఓవర్సీస్‌లో మంచి డిమాండ్ ఉండటం, రామ్‌చరణ్, సమంత కాంబినేషన్‌లో చిత్రం రూపుదిద్దుకుంటుండంతో ఎన్నారైలు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ చిత్రం ఓవర్సీస్ హక్కులను 9 కోట్ల రూపాయలకు క్రియేటివ్ సినిమాస్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్‌కు ఇప్పటివరకు ఓవర్సీస్ హయ్యస్ట్ గ్రాసర్ ధృవ. ఈ సినిమాకు 1.5 మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. అంటే దాదాపు 9.5 కోట్ల రూపాయలన్నమాట. ఇప్పుడు రంగస్థలం ఓవర్సీస్ హక్కులు 9 కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడంతో.. ఈ మాత్రం కలెక్షన్లను సాధించడం ఈ సినిమాకు పెద్ద కష్టమేమీ కాదని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.