Rangasthalam-collections-in-Overseas

రెండు మిలియన్ డాలర్ల మార్కును దాటేసిన రంగస్థలం..

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌ హీరోగా.. సమంత హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.. జగపతిబాబు, ఆది పినిశెట్టి, నరేష్, అనసూయ, ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రధారులుగా, పూజా హెగ్డే ప్రత్యేక గీతంలో మెరిసిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రామ్ చరణ్ కెరీర్లోనే హయ్యస్ట్ కలెక్షన్లు సాధించే సినిమాగా రికార్డు సృష్టిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా ‘క్రియేటివ్ సినిమాస్ న్యూయార్క్’ డిస్ట్రిబ్యూషన్‌లో అమెరికాలో విడుదలయిన ఈ సినిమా.. ఎన్నారైలను ఫిదా చేసింది..
 
గురువారం అమెరికాలో విడుదలయిన ఈ సినిమా వీకెండ్ ముగిసేనాటికి 2 మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది. సోమవారం నాటికి వచ్చిన కలెక్షన్లతో రంగస్థలం సినిమా 2.4 మిలియన్ డాలర్ల (15కోట్ల 60 లక్షల రూపాయలకు పైగానే..) మార్కును దాటేసింది. ఓవర్సీస్‌లో రామ్ చరణ్ సినిమాలన్నింటిలోనూ హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. రామ్ చరణ్ గత సినిమా ‘ధృవ’ ఓవరాల్ కలెక్షన్లను రంగస్థలం ఒక్కరోజులో దాటేసింది. మొత్తంమీద అమెరికాలోనూ రంగస్థలం జోరుమీదుంది. ఈ వారాంతం నాటికి 3మిలియన్ డాలర్ల మార్కును చేరుకుని నాన్ బాహుబలి సినిమాల రికార్డులను బ్రేక్ చేసి.. హయ్యస్ట్ కలెక్షన్లు సాధించే దిశగా దూసుకెళ్తోంది.