rangastalam-in-top-fourth-

టాప్-10 లెక్కల్ని మార్చేసిన రంగస్థలం..

రంగస్థలం ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచే సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగిపోయాయి. ఊహించినట్టుగానే అందరి అంచనాలను నిజం చేస్తూ సినిమా సూపర్‌డూపర్ హిట్టుగా నిలిచింది. మైత్రీ మూవీస్ బ్యానర్‌లో సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటించిన రంగస్థలం సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తోంది. 

1980ల నాటి కథ కావడంతో అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు దర్శకుడు తెరకెక్కించాడు.  దానికితోడు పాటలు కూడా వినసొంపుగా ఉన్నాయి. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం వహించిన ఈ సినిమా పాటలు మారుమోగుతున్నాయి. అన్ని అంశాల్లోనూ సినిమా దూసుకుపోతోంది. అదే రేంజ్‌లో కలెక్షన్లను కూడా రాబడుతోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లోనూ రంగస్థలం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.  ఇప్పటికే ఈ సినిమా 3.17 మిలియన్ డాలర్లను ఓవర్సీస్‌లో కలెక్ట్ చేసింది. అమెరికాలో అత్యధిక కలెక్షన్లను సాధించిన సిినమాల లిస్ట్‌లో మూడో స్థానంలోకి చేరింది. మొత్తంగా రికార్డు స్థాయి కలెక్షన్లతో ఓవర్సీస్‌లో టాప్ 10 లెక్కల్ని రంగస్థలం మార్చేసింది. ఓవర్సీస్‌లో టాప్-10 సినిమాలేవో ఓ లుక్కేయండి

1. బాహుబలి-2------------20.47 మిలియన్ డాలర్లు
2.బాహుబలి-1-------------7.51మిలియన్ డాలర్లు
3.రంగస్థలం----------------3.17మిలియన్ డాలర్లు ( ఇంకా థియేటర్లలో సినిమా సందడి చేస్తోంది)
4.శ్రీమంతుడు--------------2.89మిలియన్ డాలర్లు
5.అ..ఆ..------------------2.45మిలియన్ డాలర్లు
6.ఖైదీ నంబర్150----------2.45మిలియన్ డాలర్లు
7.ఫిదా--------------------2.07మిలియన్ డాలర్లు
8.అజ్ఞాతవాసి--------------2.06మిలియన్ డాలర్లు
9.నాన్నకుప్రేమతో----------2.02మిలియన్ డాలర్లు
10.అత్తారింటికి దారేదీ--------1.90 మిలియన్ డాలర్లు