Rajini-Film-Record-

రోబో 2.ఓ రికార్డుల జోరు

'2.ఓ' రికార్డుల హోరు ఓవర్‌సీస్‌లో జోరుగా వినిపిస్తోంది. అమెరికా, యూఏఈ లాంటి గల్ఫ్ దేశాలు కోట్లు సమర్పించుకుంటున్నాయి. విదేశాల్లో ఇప్పటి వరకూ 17.5 మిలియన్ డాలర్లు, అంటే, 127 కోట్లు వసూలు చేసింది '2.ఓ'. ఒక్క అమెరికాలోనే 5 మిలియన్ డాలర్లు రాబట్టి మరో రికార్డ్ నెలకొల్పాడు రజనీ. 'బాహుబలి' సిరీస్ కాకుండా అంత పెద్ద మొత్తం సాధించిన దక్షిణాది సినిమా '2.ఓ' కావటం విశేషం. ఇక గల్ఫ్ దేశాల్లో 33 కోట్ల వసూళ్ళతో కొత్త రికార్డుల వేటలో ఉంది. ఫ్రాన్స్, ఆస్ట్రేలియా మార్కెట్లలో కూడా చిట్టీ రోబో జోరు బాగానే ఉందంటున్నారు. ఇన్ని రికార్డులు బద్ధలవుతున్నప్పటికీ అనేక బెంచ్ మార్క్ ల విషయంలో 'బాహుబలి' కంటే ఇంకా వెనుకబడే ఉంది '2.ఓ'. తమిళ సినిమాకు సంబంధించి మాత్రం తిరుగులేని రారాజు రజనీ. '2.ఓ' కోలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లు చేసిన సినిమా కాగా... ఆ తరువాతి స్థానాలు కూడా 'కబాలీ', 'ఎంథిరన్' ఆక్రమించాయి. మరి రాబోయే పేట్టాతో రజనీ ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.