priyankachopra-marriage-

ప్రియాంకచోప్రా,నిక్‌జోన్స్‌ల పెళ్లికి యూఎస్ లైసెన్స్

వాషింగ్టన్‌డీసీ: బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంకచోప్రా,నిక్‌జోన్స్‌ల పెళ్లికి మరో అడుగు ముందుకు పడింది. అమెరికా నిబంధనల ప్రకారం ప్రియాంకచోప్రా,నిక్‌జోన్స్‌ల పెళ్లికి లైసెన్స్ పొందారు. ప్రియాంక, నిక్‌లు గత వారం బేవర్లీహిల్స్ కోర్టు హౌస్‌లో అవసరమైన పత్రాలను పూర్తి చేసి పెళ్లికి యూస్ సర్కారు నుంచి లైసెన్సు పొందారని పీపుల్స్ మేగజైన్ వెల్లడించింది. ఆగస్టు నెలలో నిక్, ప్రియాంకతో కలిసి ముంబయి పర్యటన సందర్భంగా రెండు కుటుంబాల మధ్య పెళ్లి కుదరింది. పెళ్లికి ముందస్తు వేడుక న్యూయార్క్ నగరంలోని టిఫ్పానీ బ్లూబాక్ కేఫ్ లో ఇటీవల జరిగింది. ఈ వేడుకలో ప్రియాంక సోదరి పరిణితీ చోప్రా కూడా పాల్గొన్నారు. పెళ్లికి యూఎస్ లైసెన్స్ పొందిన ప్రియాంక, నిక్ ల జంట డిసెంబరు నెలలో జోధ్‌పూర్ వేదికగా వివాహం చేసుకోనున్నట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.