Priyanka-Chopra-says-

ప్రియాంక న్యూయార్క్ పర్యటనలో ఉండగా..

మరికొన్ని గంటల్లో ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ జంట పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో తమ మధ్య స్నేహం ఎలా చిగురించిందీ.. ఆపై ప్రేమ, పెళ్లికి దారితీసిన పరిస్థితులకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. మొట్టమొదటిసారి నిక్.. తనను మెట్ గాలా వేడుకలో చూశారట. వెంటనే ట్విటర్‌లో ‘నిన్ను కలవాలనుకుంటున్నా’ అని మెసేజ్ చేశారట. ట్విటర్‌లో అయితే అందరికీ తెలిసిపోతుందన్న ఉద్దేశంతో పర్సనల్ నంబర్ ఇచ్చానని.. ఆపై ఎన్నోసార్లు పార్టీల్లో కలుసుకున్నామని చెప్పుకొచ్చింది.

 
న్యూయార్క్ పర్యటనలో ఉండగా తాను నిక్‌ను అపార్ట్‌మెంట్‌కు పిలిచానని.. కాసేపు మాట్లాడాక వెళ్తూ తనకు కనీసం ముద్దు కూడా పెట్టలేదని.. ఆ విషయమై తనకు ఇప్పటికీ నిక్‌పై కోపమేనని కానీ అదే విషయం తనపై ఇష్టాన్ని పెంచిందని వెల్లడించింది. తన పుట్టినరోజు సందర్భంగా గ్రీస్‌లోని క్రెటే దీవికి వెళ్లామని అక్కడ నిక్ మోకాళ్లపై కూర్చుని ‘నన్ను పెళ్లి చేసుకుని ఈ ప్రపంచంలోనే హ్యాపీయెస్ట్ పర్సన్‌గా మారుస్తావా?’ అంటూ ప్రపోజ్ చేశాడని తెలిపింది. దీంతో తను పడిపోయానని ప్రియాంక వెల్లడించింది.