:: Welcome to NRI - Article ::

ఖైదీ నెం.150.. ఓవర్సీస్ ప్రీమియర్స్‌ అన్నీ ఫుల్

తెలుగు సినిమా బతికినంతకాలం గుర్తుండే పేర్లలో ఒకటి మెగాస్టార్ చిరంజీవి. వెండితెరపై ఆయన ప్రదర్శించే ఆహార్యాన్ని చూడాలని తపించిపోయే అభిమానులు ఎందరో ఉన్నారు. మాస్‌ఇమేజ్‌కు ఆయన బ్రాండ్ అంబాసీడర్. అంతగొప్ప స్టార్ దాదాపు 8 సంవత్సరాల తర్వాత పునరాగమనం చేస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య  ‘ఖైదీ నెం.150’ సినిమా విదేశాల్లో ప్రదర్శించడానికి కొద్ది గంటలు మాత్రమే మిగలిఉంది. ఈ నేపథ్యంలో ఓ వార్త చిరు అభిమానులు, సినిమా హక్కుదారులకు సంతోషాన్ని కలిగిస్తోంది.
 
భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ‘ఖైదీ నెం.150’ సినిమా డిస్ట్రిబ్యూటర్స్‌కు శుభవార్త వినిపించింది. తెలుగురాష్ట్రాల కంటే కొన్ని గంటలు ముందుగానే విదేశాల్లో విడుదలకానున్న ఈ సినిమా కలెక్షన్ల మోత మోగించేలా కనబడుతోంది. అమెరికాలో దాదాపు 300 థియేటర్లలో ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనలకు సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. దీంతో సినిమా హక్కులను కొనుక్కున్నవారిలో సంతోషం వెల్లివిరుస్తోంది. దీంతో సినిమా టాక్ ఎలా ఉన్నా వసూళ్ల పరంగా భారీ హిట్ సాధించడం ఖాయమని సినిమా హక్కుదారులు అంచనావేస్తున్నారు. సినిమాకి ఏమాత్రం పాజిటీవ్ టాక్ వచ్చిన భారీ వసూల్లు చేయడం గ్యారంటీ అని సినిమా హక్కుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు ఓ సినిమా హిట్టావాలంటే కథలో బలం, నటన ఉండాలి. ఈ రోజుల్లో ఇవన్నీ ఉన్నా కలెక్షన్లు ఉంటేనే హిట్టంటారు.. కాబట్టి చిరు.. ఓ భారీ హిట్ అందుకోవాలని, అందుకుంటారని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.