Pawan-movie-will-release-in-209-locations-in-US

బాహుబలి-2ని దాటేసిన అజ్ఞాతవాసి..

విడుదలకు ముందే బాహుబలి-2 సినిమాను అజ్ఞాతవాసి దాటేస్తున్నాడు. బాహుబలి-2 సినిమా కంటే ఎక్కువ థియేటర్లలో విడుదలవుతూ రికార్డులు సృష్టిస్తున్నాడు. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న అజ్ఞాతవాసికి భారీ అంచనాలే ఉన్నాయి. ఓవర్సీస్‌లో పవన్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాట్లు  చేస్తున్నారు. అమెరికాలో ఈ సినిమాను ఏకంగా 209 లొకేషన్స్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. బాహుబలి-2 సినిమా 126 స్క్రీన్లలో విడుదలయింది. ఖైదీ నెం.150 సినిమా 74 లొకేషన్లలో విడుదల కాగా.. రజనీకాంత్ కబాలి 73 లొకేషన్లలో, అమీర్ ఖాన్ దంగల్ సినిమా 69 లొకేషన్లలో విడుదయ్యాయి. అమెరికాలో అత్యధిక స్థాయిలో విడుదలవుతున్న తెలుగు సినిమాగా అజ్ఞాతవాసి రికార్డు సృష్టించనుంది. విడుదలకు ముందే అరుదైన రికార్డును క్రియేట్ చేసిన ఈ సినిమా.. విడుదల తర్వాత ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో వేచిచూడాలి. సినిమాకు సంబంధించి పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి ఏమీ రాకముందే రికార్డులను తిరగరాస్తోందని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.