Pawan-have-only-one-movie-in-top-20

టాప్ 20లో పవన్ సినిమా ఒక్కటే

 

ఓవర్సీస్‌లో తెలుగు సినిమాలకు డిమాండ్ పెరిగిపోయింది. అందులోను పెద్ద హీరో సినిమా అంటే బిజినెస్ ఇంకా అదిరిపోతుంది. పవన్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కలెక్షన్లు కొల్లగొట్టేస్తాడని టాప్ రికార్డులన్నీ సొంతం చేసుకుంటాడనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఓవర్సీస్‌లో పవన్ సినిమాల పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. ఇప్పటీవరకు ఓవర్సీస్‌లో అత్యథిక కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాల టాప్ 20 లిస్ట్‌లో పవన్ సినిమా ఒక్కటే ఉంది. 2013లో వచ్చిన అత్తారింటికి దారేది 1.90 మిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించి టాప్ 8లో నిలిచింది. ఆ తర్వాత వచ్చిన గోపాల గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్ కూడా ఈ లిస్ట్‌లోకి చేరలేకపోయాయి. అందువల్ల పవన్ అభిమానులకు కొంత నిరాశే మిగిలింది. ఇప్పుడు ఆ నిరాశ పోయే అవకాశం కన్పిస్తుంది. త్వరలో ప్రేక్షుకుల ముందుకు రాబోతున్న పవన్ కొత్త మూవీ ‘అజ్ఞాతవాసి’. ఇప్పుడు ఈ సినిమాపైనే పవన్ అభిమానులు కొండంత ఆశ పెట్టుకున్నారు. తమ హీరో అత్యథిక కలెక్షన్లు సాధించి టాలీవుడ్‌తో పాటు ఓవర్సీస్‌ కలెక్షన్లలోను టాప్‌లో నిలుస్తాడని ఆశపడుతున్నారు. మరి పవన్ అజ్ఞాతవాసి సినిమాతో ఓవర్సీస్‌లో కలెక్షన్లలో టాప్‌లో 20 నిలుస్తాడో లేదో చూడాలి మరి. త్రివిక్రమ్ మ్యాజిక్ మళ్లీ పనిచేస్తుందో లేదో వేచిచూడాలి.

ఓవర్సీస్ కలెక్షన్లలో టాప్ 20 సినిమాలు
 
1. బాహుబలి-2.......... 20.47 మిలియన్ డాలర్లు
2.బాహుబలి.............   7.51 మిలియన్ డాలర్లు 
3.శ్రీమంతుడు...........                        2.89 మిలియన్ డాలర్లు
4.అ..ఆ ................                          2.45 మిలియన్ డాలర్లు
5.ఖైదీ నంబర్ 150...                         2.45 మిలియన్ డాలర్లు
6. ఫిదా..... 2.07 మిలియన్ డాలర్లు
7.నాన్నకు ప్రేమతో.....                        2.02 మిలియన్ డాలర్లు
8.అత్తారింటికి దారేది...                        1.90 మిలియన్ డాలర్లు
9.జనతాగ్యారేజ్.....                            1.80 మిలియన్ డాలర్లు
10. అర్జున్ రెడ్డి.... 1.78 మిలియన్ డాలర్లు
11.గౌతమిపుత్ర శాతకర్ణి....                    1.66 మిలియన్ డాలర్లు
12.సీతమ్మ వాకిట్లో సిరిమలె చెట్టు...         1.64 మిలియన్ డాలర్లు
13.ఊపిరి...                                    1.57 మిలియన్ డాలర్లు
14.దూకుడు....                                1.56 మిలియన్ డాలర్లు
15. స్పైడర్........ 1.56 మిలియన్ డాలర్లు
16. జై లవకుశ....... 1.56 మిలియన్ డాలర్లు
17.మనం...........                             1.54 మిలియన్ డాలర్లు
18.ఆగడు..........                              1.48 మిలియన్ డాలర్లు
19.ధృవ...............                            1.47 మిలియన్ డాలర్లు
20.భలే భలే  మగాడివోయ్.....               1.43 మిలియన్ డాలర్లు