Padmavat-ban-in-Malaysia-

మలేసియాలో ‘పద్మావత్‌’పై నిషేధం

 

కౌలాలంపూర్‌, జనవరి 29: సంజయ్‌లీలా భన్సాలీ చిత్రం ‘పద్మావత్‌’ను కష్టాలు ఇంకా వెంటాడుతున్నాయి. కర్ణిసేన, రాజ్‌పుత్‌ల ఆందోళనల మధ్య ఎట్టకేలకు భారత్‌లో జనవరి 25న ఈ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. కాగా మలేసియాలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు అక్కడి సెన్సార్‌ బోర్డు అనుమతి నిరాకరించింది. ముస్లింల మనోభావాలు దెబ్బతీసే సన్నివేశాలు ఇందులో ఉన్నాయని.. మలేసియాలో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నందున విడుదలకు అంగీకరించడం కుదరదని నేషనల్‌ ఫిల్మ్‌ సెన్సార్‌షిప్‌ బోర్డు(ఎల్‌పీఎఫ్‌) చైర్మన్‌ మహ్మద్‌ జాంబేరీ అబ్దుల్‌ అజీజ్‌ స్పష్టం చేశారు. అయితే ఈ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ సినిమా డిస్ట్రిబ్యూటర్లు.. ఫిల్మ్‌ అప్పీల్‌ కమిటీని ఆశ్రయించినట్లు సమాచారం