Overseas-distributes-tweet-about-AWE-movie

ఈ ఒక్క ట్వీట్ చాలు.. అ..! సినిమా ఎలా ఉందో చెప్పేందుకు..

అ..!.. సినిమాతో మొట్టమొదటిసారిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన నేచురల్ స్టార్ నాని.. సూపర్బ్ హిట్ కొట్టాడు. సినిమా గురించి మొదటి నుంచి చెబుతున్న మాటలు నిజమేనని ప్రేక్షకులు, సినీ విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. అ..! సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి సినిమా ఇంతవరకు రాలేదనీ, దర్శకుడు ప్రశాంత్ వర్మ.. తన మొదటి సినిమానే విభిన్న కథాంశాన్ని ఎంచుకున్నాడంటున్నారు. కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ప్రియదర్శి, అవసరాల శ్రీనివాస్.. ఇలా ఇంట్రెస్టింగ్ తారాగణంతో చెట్టుకు రవితేజ, చేప పాత్రకు నాని ఇచ్చిన వాయిస్‌ ఓవర్ సినిమాకు ప్లస్ పాయింట్..

 
కాగా ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూటర్లు చేసిన ఓ ట్వీట్.. సినిమా ఏ రేంజ్‌లో ఉందో చెప్పకనే చెబుతోంది. ఓవర్సీస్‌లో ‘నిర్వాణ సినిమాస్’.. అ..!  సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసింది. ప్రయోగాత్మక చిత్రం అవడంతో కాస్త తక్కువ సంఖ్యలోనే ఈ సినిమాను అన్ని చోట్లా విడుదల చేశారు.. తెలుగు రాష్ట్రాల కంటే ఓ రోజు ముందుగానే ఓవర్సీస్‌లో విడుదలయిన ఈ సినిమాకు.. ప్రవాసులు ఫిదా అయ్యారు. ‘అ..!.. సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అమెరికాలో సినిమా విడుదలయిన ప్రతిచోటా విపరీతమైన పాజిటివ్‌టాక్‌ను తెచ్చుకుంది. ముందుగా అనుకున్నవాటి కంటే మరిన్ని షోలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అసాధారణ చిత్రానికి ప్రేక్షకులు అందించిన అద్భుతమైన రెస్పాన్స్‌కు ధన్యవాదాలు’.. అని నిర్వాణ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తన అధికారిక ట్విటర్ పేజీలో ట్వీట్ పెట్టింది. ఇప్పటికే ఈ సినిమాకు ఒక లక్ష డాలర్లు కలెక్షన్లు వచ్చాయని.. పూర్తి ప్రీమియర్ల కలెక్షన్ల వివరాలు ఇంకా రావాల్సి ఉంది.. కాగా.. నిర్వాణ సినిమాస్ చేసిన ఈ ట్వీట్‌ను నాని రీట్వీట్  చేయడం గమనార్హం.