:: Welcome to NRI - Article ::

ముందుకు సాగుతున్న ఓం నమోవేంకటేశాయ

కింగ్ నాగార్జున, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌ సినిమా అనగానే ఎంత అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులోను భక్తిరస చిత్రం అంటే మరింత అంచనాలు పెరిగిపోతాయి. దీనికి కారణం వీరి కలయికలో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయి భక్తిరస సినిమాలు హిట్‌గా నిలవడమే. తాజాగా ఈ ఇద్దరీ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘ఓం నమోవేంకటేశాయ’. ఈ సినిమాకి మొదటిరోజు నుంచే ప్రేక్షకాదరణ లభించడం విశేషం.

మొదటిరోజు ఓం నమోవేంకటేశాయకి ఓవర్సీస్‌‌లో ప్రిమీయర్ షోల ద్వారా 15 వేల డాలర్లు, రెండోరోజు 32 వేల డాలర్ల కలెక్షన్లు దక్కినట్టు సమాచారం. ఈ లెక్కన ఓం నమోవేంకటేశాయ ఓవర్సీస్‌లో రెండో రోజులకు గాను సుమారుగా 48 వేల డాలర్లు పైనే కలెక్షన్లు సాధించినట్టు అంచనా. ఈ కలెక్షన్లు చూస్తే కింగ్ నాగార్జునకి బాక్సాఫీస్ కింగ్ అనే మాట కూడా సరిపోతుందేమో..!

Loading...