:: Welcome to NRI - Article ::

ఓం నమోవేంకటేశాయకి మొదటిరోజే కలెక్షన్ల వర్షం

కింగ్ నాగార్జున ‘ఓం నమోవేంటేశాయ’తో మరో భక్తిరస చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. కె.రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్‌లో ఇంతకు ముందు వచ్చిన ‘అన్నమయ్య’ సినిమాలో భక్తుడిగా కనిపించిన నాగ్ మరోసారి ‘ఓం వేంకటేశాయ’లో అదే తరహా పాత్రని పోషించాడు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులలో ఎక్కువ శాతం మంది ఓం నమోవేంకటేశాయ చాలా బాగుందంటూ కితాబు ఇస్తుండటం విశేషం.

క్లాస్ సినిమాలను ఇష్టపడే ఓవర్సీస్ సినీ ప్రియలు ఈ సినిమాపై విడుదలకు ముందు నుంచే ఆసక్తి చుపారు. దాని ఫలితమే గురువారం ఓవర్సీస్‌లో ప్రిమీయర్ షోల ద్వారా ఓం నమోవేంకటేశాయకి కలెక్షన్ల వర్షం కురవడం. సుమారు 79 ధియేటర్లలో ఈ సినిమా ఓవర్సీస్‌లో రిలీజయ్యింది. మొదటిరోజే  ఓం నమోవేంకటేశాయ ఓవర్సీస్‌లో 15 వేల 498 డాలర్లు కలెక్షన్లు రాబట్టిందని అంచనా. దీంతో మాస్ సినిమాలకే  కాకుండా భక్తిరస చిత్రానికి కూడా కలెక్షన్ల వర్షం కురుస్తుందనే విషయాన్ని కింగ్ నాగార్జున రుజువు చేసినట్టయ్యింది. మరి ఓవర్సీస్ సినీ ప్రియులు ఓం నమోవేంకటేశాయ సినిమాని మున్నుందు ఇంకెంత ఆదరించి, ఇంకెంత కలెక్షన్ల వర్షం కురిపిస్తారో వేచి చూడాలి.