:: Welcome to NRI - Article ::

నాగ్ సోలోగా సాధిస్తాడా?

ఇప్పటికీ నవ మన్మథుడిలా కనిపించే కింగ్ నాగార్జున మాస్ సినిమాలతో పాటు అన్నమయ్య, శ్రీ రామదాసు, శిరిడిసాయి లాంటి భక్తి రస చిత్రాలతో  ప్రేక్షకుల మదిని దోచేశాడు. తాజాగా మరో భక్తి రస చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు నాగార్జున. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగ్ నటించిన తాజా సినిమా ‘ఓం నమోవేంకటేశాయ’. ఈ సినిమా ఫిబ్రవరి 10న విడుదల కానుంది. నాగార్జున, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వస్తున్న మరో భక్తి రస సినిమా కావడంతో ఓం నమోవేంకటేశాయపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఓవర్సీస్‌లో నాగార్జున సినిమాలు మంచి కలెక్షన్లే సాధించాయి. మనం సినిమా 1.54 మిలియన్ డాలర్లు, ఊపిరి సినిమా 1.57 మిలియన్ డాలర్ల కలెక్షన్లు ఓవర్సీస్‌‌లో రాబట్టాయి. 

కాకపోతే ఈ రెండు సినిమాలు కూడా మల్లీస్టారర్ సినిమాలు కావడంతో నాగ్‌కి ఓవర్సీస్‌లో 1 మిలియన్ డాలర్లు రికార్డు సులభంగా దక్కింది. మరీ ఇప్పుడు భారీ అంచనాల నడుమ రిలీజవుతున్న ఓం నమోవేంకటేశాయ సినిమాతో..సోలోగా నాగార్జున ఓవర్సీస్‌లో 1 మిలియన్ డాలర్ల రికార్డ్‌ని సాధిస్తాడా..లేదా..? అనేది ప్రస్తుతం నాగ్ ముందున్న ప్రశ్న. క్లాస్ సినిమాలను ఇష్టపడే ఓవర్సీస్‌ సినీ ప్రియులు ఈ సినిమాపై ఆసక్తి  చూపిస్తుండటంతో..ఓం నమోవేంకటేశాయకి ఓవర్సీస్‌లో కలెక్షన్ల వర్షం కురిసే సూచనలు పుష్కలంగా కన్పిస్తున్నాయి. మరోపక్క ఇప్పటికే సినీయర్ హీరోలైన చిరంజీవి ఖైదీ నంబర్ 150తో ,బాలయ్య గౌతమిపుత్రతో సోలోగా ఓవర్సీస్‌లో 1 మిలియన్ డాలర్ల రికార్డ్‌ని దాటేశారు. మరీ ఈ సినిమాతో నాగ్ ఓవర్సీస్‌లో 1 మిలియన్ డాలర్లు రికార్డుని సోలోగా సాధిస్తాడా..లేదా?  అనే సందేహాలకు ఓం నమోవేంకటేశాయ సినిమా తెరదించనుంది. 

Loading...