:: Welcome to NRI - Article ::

ఎన్టీఆర్ బ్రేక్ చేసిన మహేష్ రికార్డులివే

‘జనతా గ్యారేజ్’ సినిమాతో కొత్త రికార్డులను సృష్టించాడు ఎన్టీఆర్. ఈ సినిమాతో ఎన్టీఆర్ ఓవర్సీస్‌లో మహేష్ పేరిట ఉన్న రికార్డులు తన సొంతం చేసుకున్నాడు. అవెంటో మీరు కూడా ఓ లుక్కేయండి. ఓవర్సీస్‌ అత్యథిక కలెక్షన్లు సాధించిన టాప్ 6 సినిమాలలో మహేష్ రెండు సినిమాలు శ్రీమంతుడు,( 2వ స్థానం) సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు( 6వ స్థానం) ఉన్నాయి. తాజాగా ‘జనతా గ్యారేజ్’ సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాను అధిగమించి టాప్‌లో 6 సినిమాలలో 6వ స్థానానికి చేరుకుంది. ఓవర్సీస్‌ టాప్ 6 సినిమాలలో మహేష్ పేరిట ఉన్న రెండు సినిమాల రికార్డును బ్రేక్ చేసి ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’,‘జనతా గ్యారేజ్’ సినిమాలు టాప్ 6లో నిలవడం విశేషం. 

అదేవిధంగా ‘శ్రీమంతుడు’ సినిమా తొలి వారంలో 57 కోట్ల కలెక్షన్లు సాధించి పాత రికార్డులను తిరగరాస్తే.. జనతాగ్యారేజ్ తొలివారంలోనే 63 కోట్లు సాధించి శ్రీమంతుడు రికార్డును వెనక్కు నెట్టేసింది.‘జ‌న‌తా గ్యారేజ్’ ఓవ‌ర్సీస్ లో కూడా మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ప్రీమియ‌ర్ షో ల ద్వారా ఈ చిత్రం దాదాపు 56 వేల 509 డాల‌ర్ల‌ను( 3 కోట్ల 76 ల‌క్ష‌ల రూపాయ‌లు) వ‌సూలు చేసి ఎన్టీఆర్ కెరీర్ లోనే ఓవ‌ర్సీస్ లో హయ్య‌స్ట్ గ్రాస‌ర్ గా నిల‌చింది. ఈ వ‌సూళ్ల‌తో ఓవ‌ర్సీస్‌లో ‘బ్ర‌హ్మోత్స‌వం’ సినిమా 55వేల 600 డాల‌ర్లు వ‌సూళ్లతో ఓవ‌ర్సీస్ లో రెండో స్థానంలో ఉన్న మ‌హేష్ ‘బ్ర‌హ్మోత్సవం’ సినిమాను దాటేశాడు ఎన్టీఆర్.

 

Loading...