NTR-biopic-joins-in-top-15-club-in-overseas

టాప్ 15లో స్థానం సంపాదించుకున్న ఎన్టీఆర్: కథానాయకుడు

తెలుగు ప్రజలకు అతి పెద్ద పెండుగ సంక్రాంతి. కానీ, ఎక్కడో అమెరికాలో ఉండే తెలుగు వారికి మాత్రం సినిమానే పండుగ. ఒకప్పుడు కలెక్షన్లు అనగానే నైజాం అనే మాటే వినిపించేది. కానీ, ఇప్పుడా మాట మారింది. ఓవర్సీస్ ప్రీమియర్ కలెక్షన్లు ఎంత అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. హిందీ సినిమాలకు కూడా రాని ఓపెనింగ్స్ అమెరికాలో తెలుగు సినిమాల సొంతం. పైగా ఓవర్సీస్‌లో సినిమా సినిమాకు తెలుగు మార్కెట్ పెరుగుతూ వెళ్తుండటం శుభపరిణామం.

ఇక ఎప్పుడెప్పుడా అని వేచిచూసిన ఎన్టీఆర్: కథానాయకుడు చిత్రం వెండితెరపైకి వచ్చేసి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ సినిమా ప్రస్థానం ఎలా మొదలైందో చూడాలని తెలుగు వారంతా వేచి చూశారు. అమెరికాలో ఉన్న తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ప్రీమియర్ కలెక్షన్లే ఇందుకు నిదర్శనం. ఇప్పటివరకు యూఎస్‌లో అత్యధిక ప్రీమియర్ కలెక్షన్లు సాధించిన తెలుగు చిత్రాలలో ఎన్టీఆర్: కథానాయకుడు చిత్రం 15వ ప్లేస్‌ను దక్కించుకుంది. విజయ్ దేవరకొండ, రష్మిక ప్రధాన నటీనటులుగా నటించిన గీత గోవిందం చిత్రం చిత్రం 15వ ఇప్పటివరకు 15వ స్థానంలో ఉండేది. ఈ చిత్రానికి ప్రీమియర్ల రూపంలో 3,77,930 డాలర్లు వచ్చాయి. కాగా, ఎన్టీఆర్ బయోపిక్ ఈ రికార్డును కొల్లగొట్టింది.

బాలకృష్ణ సినిమాలకు అమెరికాలో అత్యధిక కలెక్షన్లు రావడం గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతోనే ప్రారంభమైంది. ఆ సినిమా ప్రీమియర్ కలెక్షన్ల రూపంలో 3,73,000 డాలర్ల వర్షాన్ని కురిపించింది. మొత్తంగా బాలకృష్ణ, క్రిష్ కలయికలో వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి యూఎస్‌లో 1.6 మిలియన్ డాలర్లను రాబట్టింది. ఇప్పటివరకు బాలకృష్ణ సినిమాలకు ఓవర్సీస్‌లో వచ్చిన అత్యధిక వసూళ్లు ఇవే. మరోసారి వీరిద్దరూ కలిసి సినిమా తీస్తుండటం..ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొనడంతో ఈ బయోపిక్ ఓవర్సీస్ రైట్స్ కూడా భారీగా రూ.10 కోట్లు పెట్టి ఎల్‌ఎల్‌సీ సినిమాస్ వారు కొన్నారు. అంతేకాకుండా ఈ సినిమా కోసం అమెరికాలో ముందుగానే 200 స్కీన్లను బ్లాక్ చేసి, 600 ప్రీమియర్ షోలను వేశారు. కాగా, 3,70,000 డాలర్ల గౌతమిపుత్ర రికార్డును ఎన్టీఆర్ బయోపిక్ బద్దలు కొట్టి 4,42,998 డాలర్ల(దాదాపు మూడున్నర కోట్లు)ను ప్రీమియర్ కలెక్షన్ల రూపంలో బాలయ్య కొల్లగొట్టాడు. ఇప్పటి వరకు ప్రీమిమర్ల రూపంలో అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలను పరిశీలిస్తే..

 

1. బాహుబలి-2 -  (మొదటిరోజు- 4.56 మిలియన్ డాలర్లు)
2. అజ్ఞాతవాసి -  (1.51 మిలియన్ డాలర్లు)
3. బాహుబలి-1 -  (1.39 మిలియన్ డాలర్లు)
4 .ఖైదీ నం.150 -  (1.29 మిలియన్ డాలర్లు)
5. స్పైడర్ - (1.05 మిలియన్ డాలర్లు)
6. భరత్ అనే నేను - (దాదాపు ఎనిమిది లక్షల డాలర్లు)
7. అరవింద సమేత - (7,97,000 డాలర్లు)
8. రంగస్థలం - (7,07,000 డాలర్లు)
9.  సర్దార్ గబ్బర్‌ సింగ్ - (6,16,000 డాలర్లు)
10. జై లవకుశ - (5,89,219 డాలర్లు)
11. జనతా గ్యారేజ్ - (5,84,000 డాలర్లు)
12. బ్రహ్మోత్సవం - (5,60,000 డాలర్లు)
13. శ్రీమంతుడు - (5,36,000 డాలర్లు)
14. ఆగడు - (5,24,000 డాలర్లు)
15. ఎన్టీఆర్: కథానాయకుడు - (4,42,998 డాలర్లు)