NRIs-opinion-on-goodachari-movies

’గూఢచారి‘ చూసిన ఎన్నారైల అభిప్రాయమిది

శ‌శి కిర‌ణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్‌, శోభితా దూళిపాళ‌, జ‌గ‌ప‌తిబాబు, ప్రకాశ్ రాజ్‌, మ‌ధుశాలిని, అనీష్ కురివెల్ల‌, సుప్రియ యార్ల‌గ‌డ్డ‌, వెన్నెల కిశోర్ ప్రధాన తారాగణంతో తెరకెక్కిన సినిమా ‘గూఢచారి’ అమెరికాలోని పలు స్క్రీన్లపై విడుదలైంది. ఓవర్సీస్‌లో సుమారు 116 పైగా స్క్రీన్లపై ‘రెడ్‌హార్ట్ మూవీస్’ ఈ సినిమాను విడుదల చేసింది. అయితే ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పాజిటివ్ టాక్ వస్తోంది. సినిమాను చూసిన పలువురు ఎన్నారైలు వారి అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందని చెపుతున్నారు. సినిమాలోని తారాగణం అద్భుతంగా నటించారని, కథను వివరించిన విధానం బావుందని చెపుతున్నారు. స్క్రీన్‌ప్లే ఆకట్టుకుంటోందని, అడవి శేష్ నటన సినిమాకు ప్రధాన బలమని అభిప్రాయపడుతున్నారు. విజువల్స్‌తోపాటు బ్యాక్‌రౌండ్ మ్యూజిక్, కొరియోగ్రఫీ, మాటలు ప్రేక్షకుడిని మెప్పిస్తాయని అంటున్నారు. ప్రేక్షకులు థ్రిల్లర్‌ అనుభూతిని పొందుతారని, సినిమా మెప్పించడం గ్యారంటీ అంటున్నారు. జేమ్స్‌బాండ్  సినిమాలను తలపిస్తోందంటూ ఓ ప్రేక్షకుడు ట్వీట్ చేయగా సినిమా థ్రిల్లింగ్‌కు గురిచేస్తుందంటూ మరో ప్రేక్షకుడు ట్వీట్ చేసి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.