:: Welcome to NRI - Article ::

నిన్ను కోరి.. ప్రీమియర్స్ రివ్యూ..

నాని.. ఎన్ని హిట్లు వచ్చినా సరే సింపుల్‌గా ఉంటుంటాడు. అందుకే నేచురల్ స్టార్ అని పేరు కూడా తెచ్చుకున్నాడు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా సరే టాలీవుడ్‌లో వరుస విజయాలతో పాతుకుపోతున్నాడు. నేను లోకల్ తర్వాత ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఎంచుకుని ‘నిన్ను కోరి’ సినిమాతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆది పినిశెట్టి-నాని- నివేథా థామస్ మధ్య ట్రయాంగిల్ లవ్‌స్టోరీని దర్శకుడు శివ నిర్వాణ ఎలా తెరకెక్కించాడనే దానిపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి లవ్‌స్టోరీలు తెలుగు సినిమాల్లో కొత్త కాకున్నా.. నాని మొదటిసారి ఇలాంటి స్టోరీలో నటించడం గమనార్హం.  అమెరికాలోనే ఎక్కువ శాతం షూటింగ్ చేసుకున్న ఈ సినిమాను చూసేందుకు ఎన్నారైలు ఎంతో ఆసక్తి కనపరిచారు. అందుకే ఓవర్సీస్‌లో కూడా 500కు పైగా స్క్రీన్లలో ఈ సినిమా విడుదలయింది. అమెరికాలో ఓ రోజు ముందే గురువారం థియేటర్లలో సందడి చేసిన ‘నిన్ను కోరి’ సినిమాకు ఎన్నారైలు బాగానే కనెక్ట్ అయ్యారని తెలుస్తోంది. 

 
సినిమాలో నాని, నివేథా థామస్, ఆది పినిశెట్టి.. తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారట. ఇలాంటి పాత్రల్లో నాని నటిస్తాడని ఇంతవరకూ అనుకోలేదంటూ ఓ ఎన్నారై ట్వీట్ చేశాడు. మామూలు కమర్షియల్ సినిమాల్లా ‘నిన్ను కోరి’ కాదని మరో ప్రవాస భారతీయుడు అన్నాడు. పాటలు, సంగీతం, ఇంటర్వెల్ బ్యాంగ్, ఫ్లాష్‌బ్యాక్.. సూపర్ అని చెబుతున్నారు. అయితే సినిమా మొత్తంలో నాని మార్క్ కామెడీ మిస్ అయిందనే టాక్ ఉన్నా.. ఓవరాల్‌గా మంచి ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీని చాలాకాలం తర్వాత చూశామన్న సంతృప్తి ఉంటుందని సినిమాను చూసిన వారు చెబుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్‌కు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందనీ, తెగ నచ్చేస్తుందని ఎన్నారైలు అంటున్నారు. మొత్తంమీద నాని విజయ పరంపర కొనసాగుతూనే ఉందని తేల్చిచెబుతున్నారు. కథపై నమ్మకం ఉంచి, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా తీసిన ఈ సినిమా ఈ యేడాది ద్వితియార్థంలో మరో హిట్‌‌గా నిలిచిపోతుందంటున్నారు ఎన్నారైలు. మరి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. 

 

Loading...