New-record-

‘2.0’ సరికొత్త రికార్డ్

సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘2.0’ చిత్రం రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతోంది. ఈ చిత్రం తొలి షోతోనే విజువల్ వండర్‌గా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.400 కోట్లు రాబట్టింది. ఓవర్సిస్‌లో.. భారత్‌లో కలిపి ఈ సినిమా మొత్తం రూ.500 కోట్లు రాబట్టింది. హిందీ వర్షన్‌లో కూడా ఈ చిత్రం వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.

 
నిన్న ఒక్క రోజునే హిందీ వర్షన్ రూ.10 కోట్ల షేర్‌ను రాబట్టినట్టు తెలుస్తోంది. తొలివారంలో ఈ సినిమా నైజాంలో రూ.17 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఒక అనువాద చిత్రం ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం ఇదే మొదటిసారని తెలుస్తోంది. రేపటి నుంచి మూడు రోజుల పాటు వరుస సెలవులు కావడంతో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం నైజాంలోనూ ఈ చిత్రం సరికొత్త రికార్డును సాధించింది.