:: Welcome to NRI - Article ::

నాని 'నిన్నుకోరి' సినిమాకు కలెక్షన్ల వర్షం

అమెరికా: నాని, నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా నటించిన నిన్నుకోరి సినిమా విడుదలై హిట్ టాక్‌‌ను సొంతం చేసుకుంది.. తెలుగు రాష్ట్రాలతోపాటు, అమెరికాలోనూ ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. అమెరికాలో ఒకరోజు ముందుగానే విడుదలైన ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోందని ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ వెల్లడించారు. మూడురోజుల్లో అమెరికాలో ఈ సినిమా రూ.4కోట్ల 24 లక్షలు వసూలు చేసిందని తరుణ్ ఆదర్శ్ ట్వీట్టర్లో వెల్లడించారు. ఈ చిత్ర నిర్మాణం చాలావరకూ అమెరికాలో జరగడంతో ఎన్నారైలు నిన్ను కోరిని చూసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. 

ప్రీమియర్‌షోల ద్వారా గురువారం మొదటి రోజే ఈ సినిమా 1లక్ష 60వేల 384 డాల్లర్లు కలెక్ట్ చేసింది. రెండో రోజు అదే దూకుడు కొనసాగించి శుక్రవారం 2లక్షల 22వేల 517డాల్లర్ల వసూళ్లను రాబట్టింది. శనివారం 2లక్షల 72వేల 743 డాల్లర్లు వసూలు చేసింది. విడుదలైన మూడు రోజుల్లోనే దాదాపు హఫ్ మిలియన్ మార్క్(6లక్షల 55వేల 644 డాలర్లు) దాటేసింది. మొత్తం మీద ఈ వారంలో మిలియన్ డాలర్ల మార్క్‌ను నానీ 'నిన్నుకోరి' సినిమా దాటేసే అవకాశాలు ఉన్నాయని ఓవర్సీస్ వర్గాలు చెబుతున్నాయి. 

 

Loading...