:: Welcome to NRI - Article ::

‘ప్రేమమ్’‌తో నాగచైతన్యకు బిగ్గెస్ట్ హిట్ గ్యారంటీ..!

నాగచైతన్య సినిమాలు ఓవర్సీస్‌లో లాంగ్‌రన్‌లోనూ హాఫ్ మిలియన్ మార్కుకు చేరేవి కావు. కానీ ‘ప్రేమమ్’ మాత్రం మొదటివారంలోనే ఆ మార్కును దక్కించుకుంది. ‘ప్రేమమ్’ ప్రీమియర్ షోల ద్వారానే ఏకంగా 75 వేల డాలర్లు కలెక్ట్ చేసిందని ఓవర్సీస్ వర్గాలు తెలిపాయి. ప్రిమియర్ షోలతో కలుపుకుని ఆదివారానికి ఈ చిత్రం 5 లక్షల డాలర్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం. దీంతో మొదటివారంలోనే హాఫ్ మిలియన్ మార్కును టచ్ చేసింది ‘ప్రేమమ్’.

లాంగ్‌రన్‌లో ఈ సినిమా ఓవర్సీస్‌లో  సులభంగా  మిలియన్ మార్కును అందుకుంటుందని భావిస్తున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా మొదటివారంలో ‘ప్రేమమ్’ రూ.15 కోట్ల గ్రాస్.. రూ.9.2 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోకూడా ఈ సినిమా 6 కోట్లకు పైగా షేర్ రాబట్టుకుంది. లాంగ్‌రన్‌లో ఈ సినిమా 20 కోట్ల షేర్ మార్కును అందుకుంటుందని, తన కెరియర్‌లోనే నాగచైతన్య బిగ్గెస్ట్ హిట్ దక్కే అవకాశాలు గ్యారంటీగా ఉన్నాయని సినీ విశ్లేషకులు పలుకుతున్నారట.

Loading...