:: Welcome to NRI - Article ::

కలెక్షన్లు కొల్లగొడుతున్న ‘ఎమ్‌.ఎస్‌. ధోనీ’

ఎప్పుడూ తన బ్యాటింగ్‌తో ధనాధన్ లాడించే ధోని మరోసారి తన సత్తా ఏంటో చాటాడు. కాకపోతే ఈసారి క్రికెట్‌లో కాదండోయ్ బాక్సాఫీస్‌ కలెక్షన్లలో. ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘ఎమ్‌.ఎస్‌. ధోనీ-ది అన్‌టోల్డ్‌ స్టోరీ’. ఈ సినిమాలో ధోని పాత్రను బాలీవుడ్ నటుడు రాజ్‌పుత్ సింగ్ పోషించాడు. ఈ సినిమా సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లను కలెక్ట్ చేసి విజయవంతంగా ముందుకు దూసుకుపోతుంది. ఈ సినిమా లాంగ్‌రన్‌లో ఇంకెంత కలెక్షన్లు కొల్లగొడుతుందే అనే విషయంపై సినీ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారట. 

Loading...