:: Welcome to NRI - Article ::

మిస్టర్ సినిమా ప్రీమియర్ షో కలెక్షన్లు

బ్రూస్‌లీ వంటి ఫ్లాప్ తర్వాత మళ్లీ మెగా హీరోతోనే ‘మిస్టర్’ సినిమాతో మరో ప్రయత్నం చేశాడు శ్రీనువైట్ల. వరుణ్ తేజ్ హీరోగా, హెబ్బాపటేల్, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా భారీ తారగణంతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యావరేజ్ టాక్‌ను కూడా తెచ్చుకోలేకపోయింది. ఓవర్సీస్‌లో ఒకరోజు ముందే విడుదలయిన ఈ సినిమాకు సాధారణ స్థాయిలో కూడా కలెక్షన్లు రాలేదంటే సినిమా టాక్ ఏంటో తెలిసిపోతోంది. ఓవర్సీస్‌లో గురువారం ప్రీమియర్ షోలకు 34వేల 994 డాలర్ల కలెక్షన్లు వచ్చాయిని బాలీవుడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. అంటే మన రూపాయల్లో 22.55 లక్షలన్నమాట. ఓ మెగా హీరోకు ఇరవై రెండున్నర లక్షల రూపాయల కలెక్షన్లంటే తక్కువనే చెప్పాలి. అందులోనూ ముకుంద‌, కంచె, లోఫ‌ర్ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌లను ఎంచుకునే వరుణ్‌కు ఇది మరీ తక్కువనే చెప్పాలి. ఒకప్పుడు శ్రీనువైట్ల సినిమాలంటే ఎన్నారైలు పడిచచ్చేవారు. దూకుడు, బాద్‌షా సినిమాలకు ఓవర్సీస్‌లో కలెక్షన్ల వర్షం కురిపించారు. బాద్‌షా సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కంటే ఓవర్సీస్‌లోనే మంచి టాక్ వచ్చిందంటే శ్రీనువైట్ల మార్కును ఎన్నారైలు ఎంతగా ఇష్టపడ్డారో వేరుగా చెప్పనక్కర్లేదు. ఆగడు సినిమా ఫలితం ఎలా ఉన్నా ఓవర్సీస్‌లో 1.48 మిలియన్ డాలర్ల కలెక్షన్లు రాబట్టింది. అది మహేష్ స్టామినాతోపాటు శ్రీనువైట్ల మార్కుతోనే సాధ్యమైంది.  అలాంటి శ్రీనువైట్ల నుంచి వచ్చిన మిస్టర్‌కు కనీస మొత్తంలో అయినా కలెక్షన్లు వస్తాయని సినీ విశ్లేషకులు భావించారు. కానీ అది కాస్తా మిస్టర్‌తో బెడిసికొట్టింది. 

Loading...