:: Welcome to NRI - Article ::

దంగల్, రాయిస్‌ల రికార్డులు బద్ధలు కొట్టిన మెర్సల్..

వాషింగ్టన్: భారతీయ సినిమాలకు అమెరికాలో బాగా ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాది సినిమాలు బాలీవుడ్ సినిమాలను కూడా కలెక్షన్ల పరంగా వెనుకబడేస్తున్నాయి. మంగళవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన తమిళ హీరో విజయ్ కొత్త సినిమా మెర్సల్(అదిరింది) కలెక్షన్ల పరంగా రికార్డుల మోత మోగించింది. ఒక్కరోజులోనే మొత్తం 3లక్షల 57 వేల 925డాలర్లు(2కోట్ల 32లక్షలు) కలెక్ట్ చేసింది. అమీర్‌ఖాన్ బ్లాక్‌బాస్టర్ హిట్ దంగల్ కూడా మొదటి రోజు ఇంత కలెక్షన్లు రాబట్టలేకపోయిందని అట్మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ తెలిపింది. దంగల్ మొదటి రోజు కలెక్షన్లు 3లక్షల 28వేల డాలర్లు.

అలాగే షారుఖ్‌ఖాన్ రాయిస్ సినిమా రికార్డును కూడా మెర్సల్ బద్దలుకొట్టింది. షారుఖ్ సినిమా మొదటి రోజు 3లక్షల 49వేల డాలర్లు మాత్రమే రాబట్టగలిగింది. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో సినిమాల రికార్డులు మెర్సల్ బద్దలు కొట్టబోతోందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో మొత్తం 800 థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శించబడుతోంది. ఒక తమిళ సినిమా ఇన్ని థియేటర్లలో రిలీజ్ కావడం కూడా ఇదే మొదటిసారి.