:: Welcome to NRI - Article ::

చైనాలో మెగా సెల్ఫీ

వృత్తిరీత్యా తారల మధ్య పోటీ ఉంటుంది కానీ నిజజీవితంలో వారి మధ్య స్నేహపూరిత వాతావరణమే ఉంటుంది. అయితే వృత్తి జీవితంతో బిజీగా ఉండే తారలు ఒక చోట కలుసుకోవడం అరుదు. తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న వారు ఏ ఫంక్షన్ లోనో, మరే కార్యక్రమంలోనే కలుసుకొనే వీలుంది కానీ మిగిలిన భాషల తారల పరిస్థితి ఏమిటి? దక్షిణాదిన ఉన్న నాలుగు భాషలకు చెందిన సినీ ప్రముఖులు ఒక చోట కలుసుకోవాలంటే ఎలా? అందుకే దీనికి ఓ మార్గం కనిపెట్టారు. 1980 దశకంలో హీరోలు, హీరోయిన్లు ఉన్న వారంతా కనీసం ఏడాదికి ఒక సారన్నా కలుసుకోవాలనీ, షూటింగ్‌ షెడ్యూల్స్‌ పక్కన పెట్టి సరదాగా గడపాలనీ తీర్మానించారు. అందరూ ఆమోదించారు. అప్పటినుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ రంగాలకు చెందిన 1980ల నాటి హీరోలు, హీరోయిన్లు ఫలానా రోజు అని నిర్ణయించుకొని దేశంలోని ఏదొక ప్రదేశంలో అంతా కలుస్తూనే ఉన్నారు. ఈ ఏడాది చైనా వెళ్లారు. మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన శ్రీమతి సురేఖ, సుహాసిని, రాధిక, శరత్ కుమార్‌, భాగ్యరాజా, పూర్ణిమ, కుష్‌బూ తదితరులు గత నెల 30న బయలుదేరి చైనా వెళ్లారు. ప్రస్తుతం వారంతా అక్కడే ఉన్నారు. తమ టూర్‌కి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తునే ఉన్నారు చిరంజీవి. తాజాగా గురువారం చైనాలోని ఓ రైల్వే స్టేషన్ లో సురేఖ, రాధికతో ఆయన సెల్ఫీ దిగుతుంటే వేరొకరు తీసిన ఫొటోని పెట్టారు.