Marriage-Issue-of-actress-Priyanka-Chopra

ప్రియాంకతో నిక్‌ది బలవంతపు వివాహమట..

ప్రముఖ నటి ప్రియాంక చోప్రా, అమెరికన్ గాయకుడు నిక్ జొనాస్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అంతా హ్యాపీ అనుకుంటున్న సమయంలో ఓ షాకింగ్ వార్తను న్యూయార్క్‌కు చెందిన మ్యాగజైన్ ప్రచురించింది. ప్రియాంకతో నిక్‌ది బలవంతపు వివాహమనే కథనాన్ని ఆ మ్యాగజైన్ ప్రచురించి సంచలనం రేపింది. అంతేకాదు ఆ మ్యాగజైన్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లోనూ ఈ కథనాన్ని పోస్ట్ చేసింది. నిక్.. బాలీవుడ్ బ్యూటీతో సరదాగా ఎంజాయ్ చేయాలనుకున్నాడని కానీ ప్రియాంక అతన్ని బలవంతంగా పెళ్లి పీటల వరకూ నడిపించిందని ఆ కథనం సారాంశం.

 
ఈ కథనంపై ప్రియాంక తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అదో చెత్త కథనమని.. వివాహంతో సంతోషంగా ఉన్న తనను అలాంటి వార్తలు ఇబ్బంది పెట్టలేవని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన నిక్ సోదరుడు జో జోనాస్ అది చాలా అసహ్యకరమైన కథనమని.. అలాంటి కథనాన్ని ప్రచురించినందుకు మ్యాగజైన్ నిర్వాహకులు సిగ్గుపడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కథనాన్ని ప్రియాంకపై జాతి వివక్షతో రాశారని సోనమ్ కపూర్ పేర్కొంది. కథనంపై పెరుగుతున్న వ్యతిరేకతతో మ్యాగజైన్ నిర్వాహకులు వెబ్‌సైట్ నుంచి తొలగించారు.