:: Welcome to NRI - Article ::

కొరటాల శివకు జాక్‌పాట్ అందించిన మహేష్

మహేష్‌బాబుకి ఓవర్సీస్‌లో ఉన్నంత క్రేజ్ ఇంకో తెలుగు హీరోకు ఉండదేమో.అప్పట్లో దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ’బాహుబలి’ లాంటి భారీ బడ్జెట్ సినిమాకు ధీటుగా ఓవర్సీస్‌లో ‘శ్రీమంతుడు’ సినిమాతో కలెక్షన్లు రాబట్టడంటే ‘ప్రిన్స్’ స్టామినో ఏంటో ప్రత్యేకంగా చెప్పాలా..! మహేష్‌బాబు తాజాగా మురుగుదాస్‌తో దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడనే విషయం తెలిసిందే. ఆ తర్వాత ‘శ్రీమంతుడు’ లాంటి సూపర్ హిట్ అందించిన కొరటాల శివ సినిమాను పట్టాలెక్కిస్తాడని ఫిలింనగర్ టాక్. ఈ సినిమా గురించి వార్త ఒకటి ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది.

మహేష్‌తో తీసే సినిమాకు గానే కొరటాల శివకి రెమ్యునురేషన్ ఆ సినిమా ఓవర్సీస్ హక్కులు రూపంలో అందనున్నాయట. ‘శ్రీమంతుడు’ సినిమా ఓవర్సీస్‌లో 2,891,758$  డాలర్లు కలెక్ట్ చేసి 2015 ఓవర్సీస్ కలెక్షన్ల‌లో టాప్ 2లో నిలిచింది. దీంతో మహేష్-కొరటాల శివ కాంబినేషన్‌కు ఓవర్సీస్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. మహేష్‌తో చేసే సినిమా వల్ల కొరటాల శివకు దాదాపు 15 కోట్లు దక్కనున్నాయనని సినీ జనాలు చర్చించుకుంటున్నారట. దీంతో కొరటాల శివకు మహేష్ జాక్‌పాట్ ఇచ్చాడని సినీ విశ్లేషకులు చెప్పుకుంటునారట. 

Loading...