:: Welcome to NRI - Article ::

రికార్డు సృష్టించిన మహేశ్.. రెండో స్థానంలో ఎన్టీఆర్

స్పైడర్ సినిమాతో ఈ దసరాకు థియేటర్లలో సందడి చేసిన మహేశ్‌బాబు.. ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. టాలీవుడ్‌లో ఏ హీరోకు లేని ఓ రికార్డును మహేశ్ నెలకొల్పాడు. ఓవర్సీస్‌లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు 1.5 మిలియన్ డాలర్ల సినిమాలతో ఓవర్సీస్ కింగ్ అనిపించుకుంటున్నాడు. మహేశ్ హీరోగా, రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా, మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్పైడర్ సినిమా.. యాక్షన్ థ్రిల్లర్‌గా అభిమానులను అలరిస్తోంది. ఓవర్సీస్‌లో బాహుబలి తర్వాత అత్యధిక థియేటర్లలో విడుదలయిన ఈ సినిమా.. ప్రీమియర్ల ద్వారానే ఒక మిలియన్ డాలర్‌ను కలెక్ట్ చేసింది. అమెరికాలో సెప్టెంబర్ 28న.. అంటే మంగళవారం విడుదలయిన ఈ సినిమా.. వారం ముగిసేనాటికి.. 1.5 మిలియన్ డాలర్‌ మార్కును చేరుకుంది. 
 
దీంతో ఓవర్సీస్‌లో 1.5 మిలియన్ డాలర్లు దాటిన మహేశ్ సినిమాల ఖాతాలోకి స్పైడర్ చేరింది. ఓవర్సీస్‌లో 2.89 మిలియన్ డాలర్ల కలెక్షన్లతో శ్రీమంతుడు సినిమా మహేశ్ కెరీర్లోనే ఓవర్సీస్ టాప్ గ్రాసర్‌గా నిలిచింది. ఆ తర్వాత మహేశ్-వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా 1.64 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసిందది. దూకుడు సినిమా కూడా 1.56 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. ఇక తాజాగా వచ్చిన స్పైడర్ సినిమా మొదటి వారం ముగిసేసరికి 1.5 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. మొత్తంగా నాలుగు 1.5 మిలియన్ డాలర్ల సినిమాలతో మహేశ్‌బాబు ఓవర్సీస్ కింగ్ అనిపించుకుంటున్నాడు. టాలీవుడ్‌‌లో ఏ హీరోకు కూడా ఓవర్సీస్‌లో ఇన్ని 1.5 మిలియన్ డాలర్లు దాటిన సినిమాలు లేవు. 
 
ఓవర్సీస్‌లో 1.5 మిలియన్ డాలర్లు దాటిన సినిమాలు ఎక్కువ ఉన్న హీరోల్లో ఎన్టీఆర్ రెండో స్థానంలో ఉన్నాడు. ఎన్టీఆర్-సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా 2.02 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన జనతాగ్యారేజ్ 1.80 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న జై లవకుశ కూడా ఓవర్సీస్‌లో 1.5 మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది. మొత్తంగా మూడు 1.5 మిలియన్ డాలర్ల సినిమాలతో మహేశ్ తర్వాత ఎన్టీఆర్ ఓవర్సీస్ కింగ్ అనిపించుకుంటున్నాడు. ఎన్టీఆర్ సినిమాలన్నీ వరుస విజయాలు కాగా.. మహేశ్‌ సినిమాలు మాత్రం.. ఒకదాని తర్వాత ఒకటి కావడం గమనార్హం. ఏదిఏమైనా తెలుగు హీరోలు ఓవర్సీస్‌లో సత్తా చాటుతుండటం విశేషం.