:: Welcome to NRI - Article ::

మహేష్... ఓవర్సీస్ సూపర్ స్టార్

‘మన గురించి ఇక్కడ మాత్రమే తెలిస్తే సరిపోదబ్బా.. ఆడ కూడా తెలియాలి..’ అని ఓ సినిమాలో ఉపేంద్ర చెప్పే డైలాగ్ ఇది. అందుకేనేమో తెలుగు హీరోలు తమ సత్తాను ఓవర్సీస్‌లో చాటాలని తెగ ప్రయత్నిస్తున్నారు. పవన్ కల్యాణ్, మహేష్‌బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి కుర్ర హీరోలు తమకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించి ఓవర్సీస్‌లో కలెక్షన్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకూ ఓవర్సీస్‌లో మహేష్‌ను మాత్రం ఎవరూ దాటలేకపోయారన్నది చెప్పుకోదగ్గ అంశం. బాహుబలి-2, బాహుబలి-1 తర్వాత శ్రీమంతుడు సినిమానే టాప్‌లో ఉండటం గమనార్హం. విపరీతమైన హైప్‌తో, రాజమౌళి ఇమేజ్‌తో బాహుబలికి ఆ స్థాయిలో కలెక్షన్లు రాబట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభాస్‌కు బాహుబలి తప్ప ఏ సినిమా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఓవర్సీస్‌లో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. అయితే ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాల్లో మహేష్ సినిమాలు నాలుగు ఉండటం, ఫ్లాప్ సినిమా టాక్‌ను తెచ్చుకున్న బ్రహ్మోత్సవం సినిమా కూడా మిలియన్ డాలర్ల మార్కును దాటడం రికార్డుగా చెప్పుకోవచ్చు. ఓవర్సీస్‌లో మహేష్ కలెక్షన్ల సునామీ ఇలా ఉంది...

 
శ్రీమంతుడు----- టాప్-3----- 2.89 మిలియన్ డాలర్లు
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు--- టాప్-11-- 1.64 మిలియన్ డాలర్లు
దూకుడు----- టాప్-13------1.58 మిలియన్ డాలర్లు
ఆగడు---- టాప్-15---- 1.48 మిలియన్ డాలర్లు
 
వీటితోపాటు 1 నేనొక్కడినే సినిమా కూడా 1.33 మిలియన్ డాలర్లు సంపాదించింది. ఈ లెక్కన మహేష్‌కు భారీస్థాయిలో ఓవర్సీస్ మార్కెట్ ఉందనే విషయం తేటతెల్లమవుతోందిన ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం రాబోతున్న స్పైడర్ కూడా ఈ లిస్ట్‌లో చేరి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. 

Loading...