Mahesh-Babu-creates-sensational-Record-in-South-Indian-Cinema-

రజనీకి కూడా సాధ్యం కాని రికార్డు సృష్టించిన మహేశ్‌బాబు

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు అరుదైన రికార్డు దక్కింది. ఓవర్సీస్‌లో అత్యధిక ఒక మిలియన్ డాలర్ సినిమాలు కలిగిన హీరోల్లో ప్రథమస్థానాన్ని మహేశ్ సొంతం చేసుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 సినిమాలు అమెరికాలో ఒక మిలియన్ డాలర్ల కలెక్షన్లను కొల్లగొట్టాయి. ఫ్లాప్‌ టాక్‌ను మూటగట్టుకున్న సినిమాలు కూడా ఈ జాబితాలో ఉండటం.. ఓవర్సీస్‌లో మహేశ్ క్రేజ్‌ను చెప్పకనే చెబుతున్నాయి. టాలీవుడ్‌లోనే కాదు.. దక్షిణ భారతదేశంలోని ఏ హీరోకు ఈ రికార్డు దక్కలేదు. మహేశ్ తర్వాత ఆ స్థానాన్ని సూపర్‌స్టార్ రజనీకాంత్ దక్కించుకున్నారు. ఆయన నటించిన ఏడు సినిమాలు ఓవర్సీస్‌లో ఒక మిలియన్ డాలర్ కలెక్షన్లను రాబట్టగలిగాయి. మహేశ్‌లాగానే రజనీ విషయంలో కూడా ఫ్లాప్ ‌టాక్‌ వచ్చిన సినిమాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఓవర్సీస్‌లో ప్రవాసులు మాస్ సినిమాలను పెద్దగా చూడరు. ఫ్యామిలీ, థ్రిల్లర్, ప్రయోగాత్మక చిత్రాలకు వారు పెద్దపీట వేస్తుంటారు. మహేశ్, రజనీ ఈ కోవలోనే సినిమాలు తీస్తుండటంతో ఈ రికార్డు సాధ్యమయిందని చెప్పవచ్చు. అంతేకాక ఓవర్సీస్‌లో వీరిద్దరి సినిమాలకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. మహిళా అభిమానులు కూడా వీరిద్దరికీ ఎక్కువే. 

అమెరికాలో ఒక మిలియన్ డాలర్ కలెక్షన్లు దాటిన మహేశ్ సినిమాలు
దూకుడు
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
1 నేనొక్కడినే
ఆగడు
శ్రీమంతుడు
బ్రహ్మోత్సవం
స్పైడర్
భరత్‌ అనే నేను
*** ఈ సినిమాల్లో 1 నేనొక్కడినే, ఆగడు, బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో నెగిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఒవర్సీస్‌లో కలెక్షన్లు బాగానే వచ్చాయి. 
 
అమెరికాలో ఒక మిలియన్ డాలర్ కలెక్షన్లు దాటిన రజనీకాంత్ సినిమాలు
శివాజీ
రోబో
లింగా
కబాలి
కాలా
రోబో-2 (2.0)
పేట
 
**** ఈ జాబితాలో శివాజీ, లింగా, కబాలి, కాలా సినిమాలకు నెగిటివ్ టాక్‌ వచ్చింది. అయినప్పటికీ అమెరికాలో ఒక మిలియన్ డాలర్ కలెక్షన్లను దాటేశాయి.