mahanati-movie-created-records-

ఓవర్సిస్‌లో దూసుకుపోతున్న 'మహానటి'

తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన  'మహనటి సావిత్రి' జీవిత కథతో నిర్మించిన సినిమా 'మహనటి' ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ కుమార్తెలు ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. కీర్తి సురేష్ అద్భుతంగా నటించింది. తెలుగురాష్ట్రాల్లో బుధవారం ఈ సినిమా విడుదలైంది. అటు ఓవర్సిస్‌లో మంగళవారమే విడుదలైంది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సిస్‌లోనూ ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఓవర్సిస్‌లో అగ్ర హీరోల సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా పోటీ పడి మరీ కలెక్షన్లు కొల్లగొడుతోంది. సాధారణంగా ఓవర్సిస్‌లో వీకెండ్, హలీడేస్‌లో సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. అలాంటిది మంగళవారం (నాన్ హలీడే) రోజున మహనటి రిలీజ్ అయి కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టిస్తోంది. మంగళవారం 139 లోకేషన్లల్లో ప్రివ్యూల ద్వారా రెండులక్షల తోంభైఏడు వేల తోమ్మిది వందల తోంభై ఏడు డాలర్లు రాబట్టింది. ఈ సినిమా కలెక్షన్ల వివరాలను సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. మౌత్ టాక్‌తో ఈ సినిమా కలెక్షన్లు అంతకంతకు పెరుగుతున్నాయన్నారు.

అలాగే బుధవారం 142 లోకేషన్లల్లో లక్ష తోంబై రెండు వేల రెండు వందల పద్నాలుగు డాలర్లు రాబట్టింది. గురువారం నాటికి లక్ష ముప్ఫై తోమ్మిది వేల నూటయాబై ఒకటి డాలర్ల కలెక్షన్లు రాబట్టి మొత్తంగా ఆరు లక్షల ఇరవై తోమ్మిది వేల మూడు వందల ఆరవై రెండు డాలర్లు కొల్లగొట్టింది.. సినిమాకు రోజు రోజుకి ఆదరణ పెరుగుతుండటం, కలెక్షన్లు ఏ మాత్రం తగ్గకపోవడం చూస్తుంటే ఈ సినిమా వన్ మిలియన్ మార్క్ చేరుకోవడం పెద్ద కష్టమైన పనేమి కాదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.