mahanati-collections-in-usa

‘ఫిదా’ను అధిగమించిన ‘మహానటి’

అలనాటి నటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమా సినీజనాల ఆదరాభిమానాలను పొందుతోంది. సావిత్రి జీవిత కథను అద్భుతంగా తెరకెక్కించారంటూ చిత్ర బృందానికి అన్నీ వర్గాల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటనలో జీవించింది. ఇతర తారాగణం అద్భుతంగా నటించారు. విడుదలై మూడో వారం అడుగుపెట్టబోతున్నప్పటికీ ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబడుతోంది. ముఖ్యంగా యూఎస్ బాక్సాఫీస్ వద్ద టాప్ సినిమాలను వెనక్కు నెట్టేస్తోంది. 

గతేడాది 2017లో విడుదలై యూఎస్ బాక్సాఫీస్ వద్ద టాప్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన ‘ ఫిదా’ను ‘మహానటి’ అధిగమించింది. గతేడాది విడుదలైన ఈ సినిమా యూఎస్‌లో 2.07 డాలర్లు వసూలు చేసింది. అయితే యూఎస్‌లో ‘ఫిదా’ సినిమా కలెక్షన్లను ‘మహానటి’ అధిగమించింది. శనివారం నాటికి 2.14 మిలియన్ డాలర్లు కలెక్షన్లు రాబట్టి ‘మహానటి’.. ఫిదా సినిమాను అధిగమించింది. దీంతో 2017లో యూఎస్ బాక్సాఫీస్ వద్ద టాప్ కలెక్షన్లు సాధించిన ఫిదాను వెనక్కు నెట్టేసింది.  అంతేకాకుండా అమెరికాలో అత్యధిక కలెకన్లు వసూలు చేసిన తెలుగు సినిమాల జాబితాలో 8వ స్థానంలో నిలిచి తన సత్తాను నిరూపించుకుంది. ఇదిలావుండగా 108 పైగా లోకేషన్లలో ప్రదర్శితమవుతున్న ఈ సినిమా ఇప్పటికీ మంచి కలెక్షన్లు రాబడుతోంది. రెండో శనివారం 94,472 డాలర్లు కలెక్ట్ చేసింది. విజయవంతంగా దూసుకెళ్తోంది.