mahanati-collections-in-america

ఓవర్సిస్‌లో దూసుకుపోతున్న 'మహానటి'

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్‌పై మాహానటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మాహానటి’ సినిమా ఎంత సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సావిత్రిగా కీర్తి సురేష్ చూపిన అభినయానికి ప్రేక్షకులు మంత్ర ముగ్దులయ్యారు. ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ విజయవంతంగా ప్రదర్శించబడుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

 
అమెరికాలో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందుతూ ఇప్పటికే 2 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. ఈ సందర్భంగా ఆ విషయాన్ని తెలుపుతూ ఓ పోస్టర్ బయటకు వదిలింది చిత్రయూనిట్. తాజాగా వదిలిన ఈ పోస్టర్‌లో అచ్చం సావిత్రిలా గంభీరంగా చూస్తున్న కీర్తి సురేష్ లుక్ చూపరులను బాగా ఆకట్టుకుంటోంది. ఒక తెలుగు సినిమా అమెరికాలో ఇంత మంచి ఆదరణ పొందుతుండటం యూనిట్ సభ్యులను తెగ ఆనంద పెడుతోంది.