LA-TELUGU-got-the-aravindha-sametha-veera-raghava-movied-overseas-rights

‘అరవింద సమేత... వీర రాఘవ’ ఓవర్సిస్ హక్కులు ఎవరివంటే..

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘అరవింద సమేత... వీర రాఘవ’ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. ఫస్ట్ టైం వీళ్ళిద్దరు కలసి చేస్తోన్న ఈ చిత్రం ఎలా ఉంటుంది? త్రివిక్రమ్, తారక్‌ని ఎలా చూపిస్తాడు అని జనాలు చర్చించుకుంటూనే ఉన్నారు. ఇక యంగ్ టైగర్ బర్త్ డేకు వచ్చిన ‘అరవింద సమేంత... వీర రాఘవ’ ఫస్ట్‌లుక్‌తో తారక్ పాత్ర ఎలా సాగుతుందనే ఆసక్తి మరింత పెరిగింది. దీంతో దసరాకు విడుదల కాబోతున్న ఈ సినిమాపై మిన్నంటే అంచనాలతో ఉన్నారు నందమూరి అభిమానులు. 

కాగా తాజాగా ఈ చిత్ర ఓవర్‌సీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ‘‘LA తెలుగు’’ సంస్థ చేజిక్కించుకుందని చిత్ర బ్యానర్ హారికా అండ్ హాసిని వారు తెలిపారు. ‘జై లవకుశ’ తర్వాత ఎన్టీఆర్ కెరీర్‌లో రాబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే ఆడిపాడుతోంది. రీసెంట్‌గా ‘రంగస్థలం’లో జిగేల్ రాణిగా ఆకట్టుకున్న పూజ.. ఎన్టీఆర్ సరసన స్టెప్పులేసేందుకు ఇప్పటికే ప్రత్యేకంగా డాన్స్ ప్రాక్టీస్ కూడా చేస్తోందట. ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్‌కు జంటగా పూజాహెగ్డే నటిస్తుండటంతో వెండితెరపై ఈ న్యూ కాంబినేషన్‌ చూడాలని కుతూహలంగా ఉన్నారు ప్రేక్షకులు.